Pawan Kalyan: సీఎం జగన్‌కు ఇప్పుడు ప్రేమ పుట్టిందా: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: సీఎం జగన్‌కు ఇప్పుడు ప్రేమ పుట్టిందా: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: ఏపీలో ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు సీఎం జగన్ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు

Pawan Kalyan: ఏపీలో ఫ్లెక్సీల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు సీఎం జగన్ చేసిన ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. సీఎంకు పర్యావరణంపై ఇప్పుడు ప్రేమ పుట్టిందా అంటూ వ్యంగంగా పోస్ట్ చేశారు. విశాఖలో పారిశ్రామిక కాలుష్య నివారణకు కనీస చర్యలు లేవన్నారు. విష వాయువులు లీకేజీ అవుతూ ప్రజలు, కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వాటిని అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు చేపడతారని ప్రశ్నించారు. విశాఖలో రుషికొండను ధ్వంసం చేసి, ఇప్పుడు మాత్రం ఫ్లెక్సీల వినియోగాన్ని నిషేధిస్తున్నామనడం విడ్డూరంగా ఉందన్నారు.

నీటి వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న కంపెనీల వివరాలు ప్రభుత్వం వెంటనే సేకరించాలన్నారు. ఇదిలా ఉండగా సీఎం జగన్ ప్రకటనపై పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఫ్లెక్సీ ప్రింటింగ్‌ యాజమాన్యం సమావేశమైంది. ఫ్లెక్సీలు పర్యావరణానికి హానికరమంటూ సీఎం జగన్ ప్రకటించడం సరికాదని ఫ్లెక్సీ ప్రింటర్ సంఘం అధ్యక్షుడు నాగబాబు అన్నారు. ఫ్లెక్సీలు హానికరమా కాదా అనే అంశంపై కమిటీ వేసి నిర్ణయించాలన్నారు. హానికరం అని నిరూపిస్తే ప్రింటర్స్ ఫ్లెక్సీలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వం ఉపాధి చూపించాలని డిమాండ్ చేశారు.

ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చే లక్ష్యంతో సీఎం జగన్ రాష్ట్రంలో ఫ్లెక్సీలపై నిషేధం విధించారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యవర్థాలను వెలికితీసేందుకు పార్లే సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తిరుమలలో మాదిరిగా రాష్ట్రమంతటా ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేయాలన్నారు. అయితే అందులో భాగంగా ఫ్లెక్సీలను నిషేధించారు సీఎం జగన్. ఫ్లెక్సీలు నిషేధించడంతో ఫ్లెక్సీ ప్రింటింగ్ నిర్వాహకులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తున్న వాటిపై దృష్టిపెట్టకుండా తమకు జీవనాధారంగా ఉన్న ఫ్లెక్సీలను నిషేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story