Andhra Pradesh: ఏపీలో కొత్త కేబినెట్.. తీవ్ర నిరాశలో పలువురు నాయకులు..

Andhra Pradesh: ఏపీలో కొత్త కేబినెట్.. తీవ్ర నిరాశలో పలువురు నాయకులు..
Andhra Pradesh: ఏపీ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి.

Andhra Pradesh: ఏపీ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. కొత్త మంత్రుల జాబితాలో తమ పేర్లు లేకపోవటంపై వైసీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. అటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి.. కొత్త కేబినెట్‌లో చోటు లభించకపోవటంపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు. పిన్నెల్లికి మంత్రి పదవి కేటాయించకపోవడంపై మాచర్లలో మున్సిపల్‌ ఛైర్మన్‌తో పాటు 30 మంది కౌన్సిలర్లు ధర్నాకు దిగారు.

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పిన్నెల్లి.. జగన్‌కు అండగా నిలిచారన్నారు మున్సిపల్‌ ఛైర్మన్‌ కిశోర్‌. మంత్రి పదవి ఇస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశించామన్నారు. అధిష్ఠానం తీరుతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. మరోవైపు మాచర్ల నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీలు సమావేశమై రాజీనామాలు సిద్ధం చేశారు.

జగన్ కొత్త కేబినెట్‌లో పిన్నెల్లికి చోటు కల్పించకపోవడంతో మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల, దుర్గి, కారంపూడి మండలాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణపై నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర అంసతృప్తి వ్యక్తం చేశారు. తన పేరును కనీసం పరిశీలనలోకి తీసుకోలేదంటూ కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండోసారి గెలిచినా రిక్తహస్తం చూపించారని కోటంరెడ్డి అనుచరులు మండిపడుతున్నారు.

అటు మంత్రివర్గంలో బెర్త్‌ ఖరారు కాలేదన్న సంకేతాలు రావటంతో.. కోటంరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కోటంరెడ్డికి మంత్రిపదవి రాకపోవడంపై తడాఖా చూపిస్తామని స్థానిక వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. అతి విశ్వాసం పార్టీ కొంప ముంచుతుందని, ఇప్పటికే చేయిదాటిపోయిందని కోటంరెడ్డి అనుచరులు వాపోతున్నారు. అటు జగన్ కొత్త కేబినెట్‌లో తిరిగి బెర్త్ ఖాయమనుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ...తుది జాబితాలో పేరులేకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అలకతో స్వయంగా సీఎం జగన్‌ రంగంలోకి దిగారు. బాలినేనిని బుజ్జగించాలన్న జగన్ ఆదేశాలతో సజ్జల శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story