Srisailam : బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి

Srisailam : బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం వెళ్తున్నారా.. ఇవి తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు భారీస్థాయిలో చేస్తున్నారు. ఘనంగా నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రివ్యూలు చేసిన ప్రభుత్వం, అధికారులు, ఆలయ కమిటీ.. ప్రత్యేక బృందాలకు స్పెషల్ టాస్కులు అప్పజెప్పింది.

శ్రీశైలం మల్లన్న శివరాత్రి బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. ఆంధ్ర, తెలంగాణ నుంచే పొరుగు రాష్ట్రాల్లోని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళీ, ఉత్తరాది భక్తులు కూడా మల్లన్న దర్శనానికి వస్తుంటారు. రద్దీకి తగ్గట్టుగా వసతి, పార్కింగ్, మంచినీరు, ఆహార, ప్రసాద ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిపెట్టింది ఆలయ కమిటీ.

11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు రోజుకు దాదాపు లక్ష మందికి పైగా వస్తారని అంచనా. దర్శనం ఈజీగా అయ్యేదుకు నాలుగు రకాల స్పెషల్ క్యూలైన్లు పెట్టారు. మార్చి ఒకటో తేదీన శ్రీకాళహస్తి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు వస్తాయి. మూడో తేదీన దుర్గామల్లేశ్వరి దేవస్థానం, నాలుగున కాణిపాకం దేవస్థానం నుంచి వస్త్రాలు వస్తాయి. ఐదో తేదీన జగన్ ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించనుంది. 8వ తేదీ మహాశివరాత్రి రోజున సాయంత్రం ప్రభోత్సవం, రాత్రి 10 గంటలకు లిగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకం, అర్ధరాత్రి 12 గంటలకు స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగుతాయి. మార్చి తొమ్మిదో తేదీన తేదీ సాయంత్రం రధోత్సవం, తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 500+ బస్సులు, తెలంగాణా నుంచి 460 బస్సులను, కర్ణాటక నుంచి 170 తిరగనున్నాయి. పెద్ద వాహనాలను అడవి మార్గంలో కాకుండా మరో దారిలో అనుమతిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story