PROETST: ఏపీ వ్యాప్తంగా "జగనాసుర దహనం"

PROETST: ఏపీ వ్యాప్తంగా జగనాసుర దహనం
పాల్గొన్న నారా లోకేష్‌-బ్రాహ్మణి... నిరసనల్లో భారీగా పాల్గొన్న టీడీపీ శ్రేణులు

చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా "దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం" అంటూ తెలుగుదేశం నిరసన తెలిపింది. సోమవారం రాత్రి 7 నుంచి 7గంటల 5 నిమిషాల వరకూ తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అభిమానులు వీధుల్లోకి వచ్చి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేశారు. దేశం చేస్తోంది రావణాసుర దహనం-మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ.... తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యాక్రమంలో రాజమండ్రిలో లోకేష్, బ్రాహ్మణి పాల్గొన్నారు. సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను మంటల్లో వేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వనచంద్రబాబు అరెస్టు కు నిరసనగా పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెద్దపాలెంలో కర పత్రాలను మంటల్లో వేసి నిరసన తెలిపారు. అచ్చంపేటలో నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తత దారితీసింది. తమపై ఎస్‌ఐ దౌర్జన్యం చేస్తున్నారంటూ పోలీసు వాహనాన్ని మహిళలు అడ్డగించారు.


పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయం వద్ద సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను మంటల్లో వేసి దహనం చేశారు. జగనాసుర దహనం కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా వ్యాప్తంగా తెదేపా శ్రేణులు నిర్వహించాయి. మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ కార్యకర్తలతో కలిసి సైకో పోవాలి అని రాసి ఉన్న పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు. గుంటూరు సాయిబాబారోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. గుజ్జనగుండ్ల, దుగ్గిరాలలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మండలాల్లో ఆందోళన కార్యక్రమంలో హోరెత్తించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో సైకో పోవాలంటూ నినాదాలు చేస్తూ కర పత్రాలను మంటల్లో వేసి కల్చారు. అవనిగడ్డలో చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేశారు. కోడూరు, నాగాయలంక, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల్లో తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు రావ‌ణాసుర ద‌హ‌నం-మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం కార్యక్రమాన్ని నిర్వహించారు . నియంతపై పోరాటం అంటూ మొవ్వలో ఆందోళన చేశారు.


నెల్లూరు రూరల్ లో MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది ఆధ్వర్యంలో జగనాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. కోనసీమ జిల్లా అంబాజీపేటలో సైకో పోవాలి అంటూ రాసి ఉన్న పత్రాలను దహనం చేసి నిరసన తెలిపారు.


అమలాపురం, రాజోలు పి గన్నవరం తదితర ప్రాంతాల్లో సైకో పోవాలి అంటూ రహదారులపై ప్లకార్డులను దహనం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఏలూరు జిల్లా భీమనలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో తెదేపా నేత గన్ని వీరాంజనేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సైకో పాలన పోవాలని నిరసన తెలిపారు. పాలకొండలో సైకో పోవాలి సైకిల్ రావాలంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలను దగ్ధం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story