CBN: ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ

CBN: ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ
ఉద్యోగులు, ఫించనర్లు, టీచర్లకు చంద్రబాబు బహిరంగ లేఖ... అండగా ఉంటామని హామీ

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన PRC అందించి, సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు.. ఉద్యోగులు, ఫించనర్లు, టీచర్లకు బహిరంగ లేఖ రాసిన ఆయన..ఉద్యోగులకు ఏ ప్రభుత్వం ఏం చేసిందో వివరిస్తూ నాడు-నేడు అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వమో గుర్తించాలన్నారు. గత ఐదేళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, ఇబ్బందులను కళ్లారా చూశానని చెప్పారు.నెలల తరబడి జీతాలు రాక, ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీనగాధలు చూసి, చలించిపోయినట్లు తెలిపారు. హక్కుల కోసం ఉద్యమించిన ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ PRCతెచ్చారని ఆక్షేపించారు. అదనపు క్వాంటం పింఛన్ తగ్గించి...... వృద్ధులను ఇబ్బంది పెట్టారన్నారు. వారం రోజుల్లో CPS రద్దు చేస్తామని మోసగించారని తెలిపారు. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాలు దిగజార్చారన్నారు. APRTCని ప్రభుత్వంలో విలీనం చేశామంటూ గాలికొదిలేశారని ధ్వజమెత్తారు.

తస్మాత్‌ జాగ్రత్త

హత్యా రాజకీయాలు చేసే జగన్‌ను మరోసారి నమ్మితే ప్రతి ఇంటికి గొడ్డలి గిప్ట్‌గా వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు. నవరత్నాలు పేరిట మరోసారి నవమోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గత మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీ అమలు చేయని జగన్....ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు నిలదీశారు. వైఎస్‌ఆర్ జిల్లా కడపలో పర్యటించిన చంద్రబాబు....ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్నారు. కడప ఎవరి జాగీరు కాదని...ప్రజలు తలచుకుంటే ఎంతటివారైనా నేలకు దిగాల్సిందేనని చంద్రబాబు అన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా కడపలో ఆయన భారీ రోడ్‌షో నిర్వహించారు. నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయన్నారు. గత ఎన్నికల సమయంలో ముద్దులు పెట్టి వరాలు ఇచ్చిన జగన్...ఏ ఒక్క హామీ అమలు చేయలేదని చంద్రబాబు నిలదీశారు.

ఐదేళ్లు ముఖ్యమంత్రి ఉండి సీఎం జగన్ సొంతజిల్లాలో కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. కడప స్టీల్‌ప్లాంట్‌ను అటకెక్కించారని...కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్ట్‌ కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. రాయలసీమలో మళ్లీ హత్యా రాజకీయాలకు తెరలేపారని చంద్రబాబు విమర్శించారు. హత్య కేసు నిందితులను పక్కనపెట్టుకుని జగన్‌ ఏ విధంగా ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నవరత్నాల స్థానంలో నవమోసాలకు పాల్పడ్డారని చంద్రబాబు విమర్శించారు. ముస్లింలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ తెలుగుదేశమేనని చంద్రబాబు గుర్తుచేశారు. అధికారంలోకి వస్తే తిరిగి అన్ని పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ తెలుగుదేశాన్ని ఆదరిస్తేనే కడప అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ అభ్యర్థి మాధవీరెడ్డి అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story