CBN: వైసీపీ డిపాజిట్లు గల్లంతు

CBN: వైసీపీ డిపాజిట్లు గల్లంతు
ప్రతి ఒక్కరిలోనూ మోసపోయామనే బాధ.... సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కాలం చెల్లిందని ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లూ గల్లంతవుతాయని చంద్రబాబు విమర్శించారు. ప్రతి ఒక్కరిలోనూ మోసపోయామనే బాధ ఉందన్న ఆయన... ఆ కోపం రానున్న ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపనున్నారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా డోన్, నందికొట్కూరు బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం సూపర్‌సిక్స్ సూపర్‌ హిట్టయ్యిందన్న చంద్రబాబు...జగన్ మేనిఫెస్టో వెలవెలబోయిందని ఎద్దేవా చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదేనన్న చంద్రబాబు.... ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి సాగు, తాగునీటిని అందిస్తామని అభయమిచ్చారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు...ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జగన్‌ను ఇంటికి పంపడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదాయ మార్గాలు పెంచి సంక్షేమానికి నిధులు వెచ్చిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు..


ఇంటి ఆడబిడ్డలను గౌరవించలేని జగన్‌ ష్ట్రంలో మహిళలను ఏం గౌరవిస్తారని నంద్యాల కూటమి అభ్యర్థి బైరెడ్డి శబరి ప్రశ్నించారు.జగన్‌ను చూసే అనుచరులు కూడా ఆదే దారిలో నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్ట్‌లు పూర్తికావాలంటే తెలుగుదేశానికి మద్దతివ్వాలని నందికొట్కూరు ఉమ్మడి అభ్యర్థి గిత్తా జయసూర్య పిలుపునిచ్చారు.

నేడే మేనిఫెస్టో

ఆంధ్రప్రదేశ్‌ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.....రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే నినాదంతో తెలుగుదేశం - బీజేపీ - జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను నేడు విడుదల చేయనుంది. పన్ను బాదుడు లేని సంక్షేమం – ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో ఈ మేనిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. అప్పులు తెచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కాదని సంపద సృష్టించే సంక్షేమం అందిస్తామనే హామీని కూటమి ప్రజలకు ఇవ్వనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రూట్‌మ్యాప్‌తో మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసంలో పవన్‌, బీజేపీ నేతల సమక్షంలో నేటి మధ్యాహ్నం మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

సూపర్‌సిక్స్‌ హామీలైన సామాజిక పింఛన్లు 4వేల రూపాయలకు పెంపు, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ప్రజల దృష్టిని ఆకర్షించిన NDA కూటమి...నేడు పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. రాజమహేంద్రవరంలో 11 నెలల క్రితం నిర్వహించిన మహానాడులోనే సూపర్‌సిక్స్‌ పేరిట మినీ మ్యానిఫెస్టోను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. జనసేనతో పొత్తు ఖరార్యయాక...మరికొన్ని హామీలు జోడించింది. భాజపాతో జట్టు కట్టిన తర్వాత మూడు పార్టీల నేతలు ఉమ్మడి మ్యానిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశారు. ‘నేటి అవసరాలు తీరుస్తాం- రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం’ అంటూ తుది రూపు నిచ్చారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలోని పథకాలను వైకాపా రద్దు చేయగా...వాటిని తిరిగి పునురద్ధరించే అవకాశం ఉంది. అన్న క్యాంటీన్‌లు, పండుగ కానుకలు తిరిగి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ‘అధిక పన్నులు, భారాల బాదుడు లేని సంక్షేమం- ప్రతి ప్రాంతంలో అభివృద్ధి’ అన్నది ప్రధానాంశంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్టు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story