AP: టీడ్కో ఇళ్లు ఇచ్చేదెన్నడు?

AP: టీడ్కో ఇళ్లు ఇచ్చేదెన్నడు?
కాలయాపన చేస్తున్న జగన్‌ ప్రభుత్వం.... కడపలో టీడ్కో ఇళ్లను పరిశీలించిన టీడీపీ-జనసేన

తమది పేదల ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం... టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. కడప నగరంలో టీడీపీ-జనసేన బృందం టిడ్కో ఇళ్ల సందర్శించింది. టీడీపీ హయాంలో 90శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి అయిన వైసీపీ ప్రభుత్వం పార్టీ రంగులు వేసుకుని వాటిని పేదలకు ఇవ్వడంలేదని నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా సరే వైసీపీ ప్రభుత్వం ముందుకు కదిలించడం లేదు. దీనికి టిడ్కో ఇళ్లు కూడా మినహాయింపు కాదు. ఉమ్మడి కడపజిల్లాలో దాదాపు 19 వేల టిడ్కో ఇళ్లను 2017లో గత తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది. వాటి నిర్మాణాలు 90 శాతం పూర్తయ్యాయి. 2019లో ఎన్నికల కోడ్ రావడంతో ఇళ్లను పేదలకు పంపిణీ చేయకుండా నిలిపేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీప్రభుత్వం టిడ్కో ఇళ్లను పంపిణీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేసింది.


విమర్శలు రావడంతో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని ఏడాది కిందట టిడ్కో భవనాలకు వైసీపీ రంగులు వేసి వాటి తాళాలు పేదలకు అందజేయలేదు. ప్రస్తుతం టిడ్కో భవనాలు నిర్మానుష్యంగా, కంపచెట్ల మధ్య కొనసాగుతున్నాయి. కడప శివారులోని లక్ష్మీనగర్, చలమారెడ్డి పల్లెలో దాదాపు 2 వేలకు పైగా టిడ్కో ఇళ్లను మంజూరు చేశారు. టిడ్కో ఇళ్లు ఇస్తారనే ఆశతో భవనాల సమీపంలోనే అద్దెకు ఇళ్లు తీసుకుని జీవనం సాగిస్తున్న పేదలు లబోదిబో మంటున్నారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందాలంటే పునాది వేసి నిర్మించిన చంద్రబాబు మళ్లీ సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు.కడప శివారులోని టిడ్కో ఇళ్లను పరిశీలించిన టీడీపీ-జనసేన నేతలు... అప్పు చేసి డబ్బులు చెల్లించినా టిడ్కో లబ్ధిదారులకు ఇంతవరకు ఇళ్లు ఇవ్వలేదని, అసలు వారు చేసిన పాపమేంటో చెప్పాలని ప్రశ్నించారు.


తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన టిడ్కో ఇళ్లను పేదలకు ఇంకెప్పుడు ఇస్తారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారా ణి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ల సముదాయం వద్ద శనివారం ఆమె విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభు త్వం పేదలకు నాణ్యమైన ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఉద్దేశంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు. తమ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు వైసీపీ ప్రభుత్వం కేవలం పార్టీ రంగులు వేసుకుందన్నారు. ఆ రంగులు వెలిసిపోతున్నా ఇంకా ఇళ్లు పేదలకు అందడం లేదని అన్నారు. అస్సలు పేదలకు ఇస్తారా...? లేదా..? అని ప్ర శ్నించారు. నాలుగు నెలల్లో ఎలాగూ ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావని.. తమ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ నాయకుడి చేతులమీదుగా పేదలకు పంపి ణీ చేస్తామని చెప్పారు. ఇప్పటికి నాలుగుసార్లు సందర్శించామని అన్నారు. సందర్శిం చిన ప్రతిసారీ ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వస్తుంది తప్ప ఇళ్లు మాత్రం పేదలకు చేరడం లేదని ఆమె ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story