Guntur: డయేరియా బాధితలకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ఆందోళన

Guntur: డయేరియా బాధితలకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ఆందోళన
ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదంటూ ఆగ్రహం

గుంటూరులోప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభు తాగి అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మృతిచెందిన బాధితులకు న్యాయం చేయాలని తెలుగుదేశం డిమాండ్‌ చేసింది. రాష్ట్రంలో డయేరియాతో అనేక మంది ఆస్పత్రిపాలవుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని నేతలు మండిపడ్డారు.

డయేరియా అనుమానిత లక్షణాలతోమృతి చెందిన పద్మ కుటుంబానికి పరిహారం అందించాలని మంత్రి విడదల రజినికి గుంటూరు తెలుగుదేశం నేతలు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌కు కూడా మెమోరాండం ఇచ్చారు. కలుషిత నీటి సరఫరా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నేత నసీర్ అహ్మద్ డిమాండ్‌ చేశారు. బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. స్థానిక MLAకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కలుషిత నీరు తాగి రాష్ట్రంలో వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు అన్నారు. ఇంత జరుగుతున్నా ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సురక్షిత తాగునీరు అందక మరణాలు సంభవిస్తుంటే సీఎం జగన్‌ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డయేరియా కేసులపై ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

వాంతులు, విరేచనాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వారి సంఖ్య 75కు చేరిందని మంత్రి రజిని తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించిన మంత్రి... నగరంలో ఆరోగ్య పరిస్థితులపై ఇంటింటి సర్వే చేస్తున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాగునీరు, ఆహార శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపామని... రిపోర్టు రాగానే చర్యలు చేపడతామని రజిని వివరించారు. ఇక ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్లో నగరపాలక, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో తాగునీటి సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి విడదల రజిని ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై నిందలు వేయాలనుకుంటే వేయొచ్చని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీటి విషయంలో ఎంక్వయిరీ జరుగుతోందని, అధికారులు ఏమైనా తప్పిదాలు చేస్తే చర్య తీసుకుంటామని విడదల రజిని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story