Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై భగ్గుమన్న నేతలు

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌పై భగ్గుమన్న నేతలు
రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు..

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర బంద్​కు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇంటి నుంచి వెళ్లకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. మరోవైపు పలువు నేతలు బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించారు. బంద్ కి సంపూర్ణ మద్దతు తెలిపామని లోకేష్ కు తెలిపారు. నియంత పాలన పై అందరూ కలిసి పోరాడదామని లోకేష్ తో అన్నారు. బంద్ కి మద్దతు ఇచ్చినందుకు నారాయణకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.


చంద్రబాబును ఆర్థిక నేరస్థుడిగా చిత్రీకరించడమే వైకాపా ప్రభుత్వం పనిగా పెట్టుకోందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ లండన్ నుంచి తిరిగిరాగానే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికే చంద్రబాబును అరెస్టు చేశారు తప్ప C.I.D. పెట్టిన కేసుల్లో పస లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలే రాష్ట్రంలో నేటి పరిస్థితులకు కారణమని తెదేపా నేత కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరులోని కన్నా లక్ష్మినారాయణ ఇంటివద్ద పోలీసులు మోహరించారు. ఆందోళనల్లో పాల్గొనకుండా ఆయన్ను గృహ నిర్భందం చేశారు. మరోవైపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పట్టణ సీఐ రమేష్ బాబు తన సిబ్బందితో అఖిల ప్రియ నివాసానికి వెళ్లి నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమె బయటికి రాకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.




వైకాపా నేతలు విశాఖలో చేస్తోన్న భూ ఆక్రమణలపై జనసేన నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. విశాఖలోని పోర్టు గెస్ట్ హౌస్ లో జనసేన బృందం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అడ్డుకున్న తీరును జనసేన నేతలు గవర్నర్ కు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story