AP: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత

AP: గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత
బారికేడ్లు తొక్కుకుంటూ వెళ్లి నివాళులు అర్పించిన టీడీపీ-జనసేన శ్రేణులు... వెనుదిరిగిన కొడాలి నాని

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. వైసీపీ శ్రేణుల కవ్వింపులను తెలుగుదేశం-జనసేన కార్యకర్తలు తిప్పికొట్టారు. NTR విగ్రహం వద్దకు అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టారు. వాటిని తమ వాహనాలతో తొక్కించుకుంటూ వెళ్లి నివాళులు ఆర్పించారు. ఈ క్రమంలో లాఠీఛార్జ్‌ జరిగింది. వేల సంఖ్యలో తరలివచ్చిన పసుపు దళాన్ని చూసి ఎమ్మెల్యే కొడాలి నాని అక్కడి నుంచి వెనుదిరగక తప్పలేదు. కృష్ణా జిల్లా గుడివాడలోNTR వర్థంతి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పట్టణంలోకి అనుమతి లేదంటూ తెలుగుదేశం,జనసేన శ్రేణుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. NTR విగ్రహం వద్దకు వెళ్లరాదంటూ బారికేడ్లు అడ్డుపెట్టారు.


మహనీయుడి వర్ధంతి రోజు ఆయన విగ్రహానికి దండ వేయనీయకుండా అడ్డంకులేంటంటూ పోలీసులతో తెలుగుదేశం, జనసేన శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. కొడాలి నానికి అనుమతి ఇచ్చి తమను అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. NTRకు నివాళులర్పించేందుకు గుడివాడ తెలుగుదేశం కార్యాలయానికి భారీగా చేరుకొన్న టీడీపీ, జనసేన కార్యకర్తలు బైకు ర్యాలీకి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించాల్సిందేనంటూ వెనిగండ్ల రాము బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు తెలుగుదేశం- జనసేన శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఆగ్రహంతో బారికేడ్లను వాహనాలతో తెలుగుదేశం, జనసేన శ్రేణులు గుద్దుకుంటూ ఎన్టీఆర్ విగ్రహం వైపు దూసుకెళ్లారు.


NTR స్టేడియంలో నందమూరి తారక రాముడి విగ్రహం వద్దకు చేరుకుని తెలుగుదేశం- జనసేన నేతలు నివాళులర్పించారు. ఆ సమయంలో కొడాలినాని వెనుక పదుల సంఖ్యలో మాత్రమే శ్రేణులు ఉన్నారు. వేలాదిగా ఒక్కసారిగా దూసుకొచ్చిన తెలుగుదేశం - జనసేన శ్రేణుల్ని నియంత్రించలేక పోలీసులు సైతం చేతులెత్తేశారు. NTR విగ్రహం వద్దకు తెలుగుదేశం శ్రేణులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంగణం నుంచి కొడాలి నాని వెళ్లిపోయారు. NTRకు నివాళులర్పించిన తెలుగుదేశం, జనసేన నేతలు, కార్యకర్తలు గుడివాడ గడ్డ తెలుగుదేశం అడ్డా అంటూ పెద్ద ఎత్తున నినదించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ జోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story