YSRCP : ఊపు తెచ్చిన నాలుగో సిద్ధం.. వైసీపీ లాస్ట్ పంచ్ అదుర్స్

YSRCP : ఊపు తెచ్చిన నాలుగో సిద్ధం.. వైసీపీ లాస్ట్ పంచ్ అదుర్స్

వైఎస్ఆర్ సీపీ (YSRCP) అధినేత జగన్ పేరు ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. జైలుకెళ్లినా.. జనంలో ఉంటూ సింపతీతో తిరుగులేని విజయం సాధించి సీఎం అయ్యారాయన. 2019 తర్వాత 2024లో మలివిడత ఎన్నికల్లో మరోసారి సీఎం కావాలని తహతహలాడుతున్నారు. అందుకే.. సిద్ధం పేరుతో అద్భుతమైన సెటప్ తో ప్రతిపక్ష తీన్ మార్ కూటమికి ఓ రకంగా దడపుట్టించడంలో జగన్ సక్సెస్ అయ్యారు.

సీఎం జగన్ ప్రసంగాన్ని వినేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదటి మూడు సభలో ఎత్తైతే.. బాపట్ల జిల్లా అద్దంకి - మేదరమెట్లలో జరిగిన చివరి సిద్ధం సభ మరో హైలైట్. మేదరమెట్ల నాలుగో సిద్ధం సభకు సుమారు 15 లక్షల పైచిలుకు అభిమానులు హాజరయ్యారని ఇంటలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. సభా ప్రాంగణంలో ఎంతమంది అభిమానులు ఉన్నారో.. సభ బయట రోడ్డు మీద అంతకు మించి క్యాడర్ హాజరైందని.. ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి తెలిపాయట.

ఒక్కో సభకు జన సమీకరణ పెంచుకుంటూ పోయారు వైసీపీ నేతలు. రాప్తాడు సభలో 10 లక్షల మంది అభిమానులు హాజరయ్యారని పార్టీ వర్గాలు తెలిపాయి. అద్దంకి సభను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 15 లక్షల మంది రానున్నట్లు ముందుగానే ప్రకటించి భారీ ఏర్పాట్లు చేశారు. 44 నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలను తరలించారు. జిల్లాల నుంచి ప్రత్యేకంగా బస్సులు పెట్టింది. దీంతో.. మేదరమెట్ల హైవే కిక్కిరిసి కనిపించింది. వైసీపీ నాలుగో సిద్ధం సభకు వచ్చిన జనంపై నేషనల్ మీడియాలోనూ కథనాలు వస్తున్నాయంటే ఈ సభ ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story