ఆంధ్రప్రదేశ్

Varla Ramaiah: జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

Varla Ramaiah: భువనేశ్వరిని విమర్శిస్తే జూనియర్ స్పందించిన తీరు సరిగా లేదు-

Varla Ramaiah: జూనియర్ ఎన్టీఆర్‌పై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు
X

Varla Ramaiah: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతల వ్యాఖ్యల్ని ఖండించడంలో మేనల్లుడిగా జూనియర్ ఫెయిల్ అయ్యారని ఘాటైన విమర్శలు చేశారు.

జూనియర్‌కు సన్నిహితులుగా చెప్పుకొనే వంశీ, కొడాలినానీ.. హద్దులు మీరి విమర్శిస్తుంటే స్పందించాల్సింది ఇలాగేనా అని ప్రశ్నించారు. సినిమాలు అందరికి ఉంటాయని, కానీ స్పందించాల్సిన చోట నాన్చుడు సరికాదని అన్నారు.

అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని వైసీపీ నేతలు కించపరిచినందుకు నిరసనగా ఇవాళ వర్ల రామయ్య కుటుంబ సమేతంగా నల్లదుస్తులు ధరించి 12 గంటల దీక్ష చేపట్టారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకూ దీక్ష చేస్తారు.

జూనియర్ NTRపై వర్ల రామయ్య వ్యాఖ్యల్ని సమర్థించిన బుద్దా వెంకన్న

జూనియర్‌పై మా మనసులో ఉన్నదే వర్ల రామయ్య బయటపెట్టారు..

మావయ్య, అత్త అనుకోవడం కాదు.. కష్టమొస్తే బయటికొచ్చి మాట్లాడాలి..

జూనియర్ వ్యాఖ్యలు చూసి వైసీపీ నాయకులు సైతం..

ఏంటీ ఎన్టీఆర్ ఇలా మాట్లాడారు అని అనుకుంటున్నారు

నారా భువనేశ్వరికి మేనల్లుడిగా జూనియర్ ఫెయిల్ అయ్యారు..

జూనియర్‌కు సన్నిహితులుగా చెప్పుకొనే వంశీ, కొడాలినానీ..

భువనేశ్వరిని విమర్శిస్తే జూనియర్ స్పందించిన తీరు సరిగా లేదు- వర్ల

సినిమా లు అందరికి ఉంటాయి..

బాలకృష్ణ ఎలా స్పందించారు.. జూనియర్ ఎలా స్పందించారు..

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వారే టీడీపీ సభ్యులు..

జూనియర్‌పై నేను చేసిన వ్యాఖ్యలు నా వ్యక్తిగతం మాత్రమే- వర్ల

జూనియర్ స్పందించిన తీరు సరిగా లేదనిని కడుపుమండి మాట్లాడుతున్నా..

వైసీపీ సభ్యుల తీరుపై భువనేశ్వరికి సీఎం క్షమాపణ చెప్పాలి- వర్ల

ఆరోజు అసెంబ్లీ రికార్డ్స్‌ బయట పెట్టాలి- వర్ల రామయ్య

Next Story

RELATED STORIES