వాలంటీర్ ఓవరాక్షన్‌.. ఓటీఎస్‌ రూ.10 వేలు కట్టకపోతే పెన్షన్, పథకాలు ఆపేస్తామంటూ హెచ్చరిక

వాలంటీర్ ఓవరాక్షన్‌.. ఓటీఎస్‌ రూ.10 వేలు కట్టకపోతే పెన్షన్, పథకాలు ఆపేస్తామంటూ హెచ్చరిక
ఓటీఎస్‌ స్వచ్ఛందం అంటూనే.. వాలంటీర్లను పదేపదే ఇళ్లకు పంపి పేదల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. విజయనగరంలో ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి.

ఓటీఎస్‌ స్వచ్ఛందం అంటూనే.. వాలంటీర్లను పదేపదే ఇళ్లకు పంపి పేదల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. విజయనగరంలో ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. OTS కట్టని వాళ్లకు పెన్షన్లు ఆపేస్తామని, పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్లు బెదిరిస్తున్నారని బాధితులు చెప్తున్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం నంద గ్రామానికి చెందిన బిడ్డయ్య అనే గిరిజనుడికి వాలంటీర్ ఇప్పటికే పెన్షన్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నాడు. ఎక్కడ చెప్పుకున్నా సరే.. OTS కడితే తప్ప పెన్షన్ ఇచ్చేది తేలని తెగేసి చెప్పాడని అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. బిడ్డయ్య మేనల్లుడు రామకృష్ణ ఈ అన్యాయాన్ని TDP అరకు పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌ సంధ్యారాణి దృష్టికి తీసుకువెళ్లారు. 1వ తేదీన తన మామయ్యకు ఇవ్వాల్సిన పెన్షన్ ఇంకా ఇవ్వలేదని, పైగా ఎదురు బెదిరిస్తున్నారని వాపోతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story