AP: ఏపీలో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం

AP: ఏపీలో కూటమి అభ్యర్థుల ముమ్మర ప్రచారం
ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన... వైసీపీ అరాచకాలను ఎండగడుతూ గెలుపు కోసం ప్రయత్నాలు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ... కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. వైసీపీ అరాచకాలను ఎండగడుతూ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు పెరిగాయి. అనంతపురంలో కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం 16వ వార్డు M.I.M. కౌన్సిలర్‌ మామాజాగ్ని బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. ఆయనతోపాటు MIM పట్టణ అధ్యక్షుడు, మరో 20 మైనారిటీ కుటుంబాలు పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. చిలమత్తూరు మండలానికి చెందిన 100 మంది మైనారిటీలకు... బాలకృష్ణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన 30 కుటుంబాలు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరాయి. గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం నెమళ్లపల్లికి చెందిన 100 వాల్మీకి కుటుంబాలు వైకాపాను వీడి టీడీపీలో చేరాయి. కూటమి అభ్యర్థి గుమ్మనూరు జయరాం వారికి పార్టీ కండువా కప్పారు.


చిత్తూరు కూటమి అభ్యర్థి గురజాల జగన్‌మోహన్‌ నగరంలోని డివిజన్లలో ప్రచారం చేశారు. వైసీపీ రాక్షస పాలనను తరిమికొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. కర్నూల్ జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళం మండలం ఉప్పరహాల్ గ్రామం నుంచి 50కుటుంబాలు వైసీపీని వీడి తెదేపాలో చేరాయి. కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి వారికి పార్టీ కండువా కప్పారు. నంద్యాలలోని గిరినాథ్‌ సెంటర్‌లో తెలుగుదేశం ప్రచారం నిర్వహించింది. కూటమి అభ్యర్థి N.M.D. ఫరూఖ్‌ కుమారుడు N.M.D. ఫిరోజ్‌ ఇంటింటికీ తిరిగి ఓటర్లను చైతన్యవంతం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ఆధ్వర్యంలో కోవూరు, రాజుపాలెంకు చెందిన కొంత మంది తెలుగుదేశంలో చేరారు..


బాపట్ల జిల్లా పర్చూరు కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చినగంజాం మండలంలో పర్యటించారు. మున్నంవారిపాలెం, కడవకుదురుకు చెందిన 50 కుటుంబాలు ఆయన సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్‌ ఇంటింటి ప్రచారం చేశారు. కరపత్రాలు పంచుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం టి.కొత్తపల్లికి చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. అమలాపురం పార్లమెంటు అభ్యర్థి గంటి హరీష్‌, అసెంబ్లీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జలో కూటమి అభ్యర్థి కూన రవికుమార్‌ ప్రచారం చేశారు. ట్రాక్టర్‌ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.

Tags

Read MoreRead Less
Next Story