BYJUS : బైజూస్ మరో కీలక నిర్ణయం .. ఆఫీసులన్నీ క్లోజ్

BYJUS : బైజూస్ మరో కీలక నిర్ణయం ..   ఆఫీసులన్నీ క్లోజ్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న బైజూస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియాలోని అన్ని కార్యాలయాలు మూసివేయనుందట. భవనాలకు రెంట్లు భరించే ఆర్థిక స్థోమత లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా దేశవ్యాప్తంగా దాదాపు 300 బైజూస్ ట్యూషన్ సెంటర్లలో పనిచేస్తున్న వారిని మినహాయించి, ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సిందేనని చెప్పిందట.

బెంగళూరులోని ప్రధాన కార్యాలయం మాత్రమే కొనసాగుతుందని జాతీయ మీడియా పేర్కొంది. ఒకప్పుడు ప్రపంచంలోని మోస్ట్ వాల్యూడ్ ఎడ్‌టెక్ కంపెనీగా ఉన్న బైజూస్‌ ఇటీవల తీవ్ర ఇబ్బందులతో సతమతమవుతోంది. బిలియన్ డాలర్ల విలువను కోల్పోయింది. బైజూస్ కంపెనీకి ప్రస్తుతం భారత్‌లో 14 వేల మంది వరకు ఉద్యోగులు ఉన్నారు.

ఇటీవలే బైజూస్ ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉద్యోగులందరికీ వేతనాల్లో కొంత భాగాన్ని ఇచ్చినట్టు ప్రకటించింది. రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను ఉపయోగించుకునే అవకాశం రాగానే మిగిలిన మొత్తం చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 14,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story