Donkey Milk : లీటర్ గాడిద పాల ధర రూ.7 వేలు

Donkey Milk : లీటర్ గాడిద పాల ధర రూ.7 వేలు

గుజరాత్‌కు చెందిన సోలంకి గాడిద పాలతో రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఉద్యోగంలో వచ్చే జీతం కుటుంబ అవసరాలకు సరిపోదని నిర్ణయించుకున్న అతడు 8 నెలల క్రితం ₹22 లక్షల పెట్టుబడితో గాడిదల ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం అతడి వద్ద 42 గాడిదలు ఉండగా నెలకు రూ.3 లక్షల విలువ చేసే పాలను విక్రయిస్తున్నారు. మార్కెట్లో లీటర్ గాడిద పాల ధర ₹5-7 వేల వరకు పలుకుతోందని సోలంకి చెప్పారు. పాల పొడి అయితే కిలో రూ.లక్ష పలుకుతోందట.

గాడిద పాలను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు ధీరేన్ సోలంకి ఆన్ లైన్ బాటపట్టాడు. సొంతంగా ఆన్ లైన్ ప్లాట్ ఫాం ఏర్పాటు చేసుకొని గాడిద పాలను అధిక రేట్లకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం లీటరు ఆవు పాల కనీస ధర రూ. 65 ఉండగా లీటరు గాడిద పాలు ఏకంగా రూ. 5,000 పలుకుతున్నాయి. నెలకు సుమారు రూ. 3 లక్షలు ఆర్జిస్తున్నాడు. లాభాలు బాగుండటంతో రూ. 38 లక్షలుపెట్టి డెయిరీ ఫాంను విస్తరించాడు. ప్రస్తుతం 42 గాడిదలు డెయిరీ ఫాంలో ఉన్నాయి.

ఆవు, గేదె పాలతో పోలిస్తే గాడిద పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గాడిద పాలలో ఔషధ గుణాలు ఉండటమే అందుకు కారణం. ఇవి తల్లి పాలను పోలి ఉంటాయి. అలాగే ఆవు పాలంటే ఎలర్జీ ఉండే శిశువులకు గాడిద పాలు సరైన ప్రత్యామ్నాయం. పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి, ఇమ్యూనిటీ పెరుగుదలకు దోహదపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో డయాబెటీస్ నిరోధక లక్షణాలు కూడా పుష్కలంగా వున్నాయట.

Tags

Read MoreRead Less
Next Story