Amul : అమెరికాలో గుజరాతీ అమూల్ పాలు

Amul : అమెరికాలో గుజరాతీ అమూల్ పాలు

అమెరికాలోని (America) భారత ప్రవాసులు, ఆసియా జనాభాను దృష్టిలో ఉంచుకుని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ వారం రోజుల్లో నాలుగు రకాల పాలను అమెరికా మార్కెట్లోకి విడుదల చేయనుంది. 'దశాబ్దాలుగా పాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామనీ.. భారతదేశం బయట తాజా పాలను విడుదల చేయడం ఇదే మొదటిసారి అని జిసిఎంఎంఎఫ్ ఎండి జయేన్ మెహతా పిటిఐకి తెలిపారు. అమెరికా మార్కెట్లో తాజా పాలను విడుదల చేయడానికి జిసిఎంఎంఎఫ్ 108 సంవత్సరాల పురాతన సహకార సంస్థ మిచిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎంఎంపిఎ)తో ఒప్పందం కుదుర్చుకుంది.

పాల సేకరణ, ప్రాసెసింగ్ ఎంఎంపిఎ చేస్తుందని, జిసిఎంఎంఎఫ్ అమూల్ తాజా పాల మార్కెటింగ్, బ్రాండింగ్ చేస్తుందని కంపెనీ తెలిపింది. వారం రోజుల్లో అమూల్ తాజా, అమూల్ గోల్డ్, అమూల్ శక్తి, అమూల్ స్లిమ్ అండ్ ట్రిమ్ యూఎస్ మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని చెప్పింది. న్యూయార్క్, న్యూజెర్సీ, చికాగో, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్ తదితర ప్రాంతాల్లో తాజా పాలు లభిస్తాయని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఎన్ఆర్ఐలు, ఆసియా జనాభాను లక్ష్యంగా చేసుకుని ఈ స్టెప్ తీసుకుంది కంపెనీ.

వచ్చే 3-4 నెలల వరకు జిసిఎంఎంఎఫ్ బ్రాండింగ్, మార్కెటింగ్ పై దృష్టి పెట్టనుంది. కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తోంది. పనీర్, పెరుగు, వెన్న, వంటి తాజా పాల ఉత్పత్తులను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story