Impact of Ugadi : ఉగాది ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూల ధరలు

Impact of Ugadi : ఉగాది ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూల ధరలు

రేపు ఉగాది పండుగ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో పూల ధరలు భారీగా పెరిగాయి. హోల్‌సేల్ మార్కెట్‌లో తెల్ల చామంతి కేజీ రూ.450, మిగిలిన చామంతులు రూ.350-రూ.400 పలుకుతున్నాయి. మల్లెలు కేజీ రూ.700-రూ.800, చిన్న గులాబీలు రూ.250-రూ.300, బంతిపూల రేటు రూ.80-రూ.100గా ఉంది. బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

ఎండల కారణంగా పూల దిగుబడి తగ్గడం, ఉగాదికి డిమాండ్ పెరగడంతో రేట్లు పెరిగాయి. ఇక, ఈ రోజు, రేపు ఉభయ గోదావరి జిల్లాలకు ఎగుమతులు ఉండటం వల్ల ఈ పూల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది పూల రైతులకు మంచి పరిణామం. ఈ రకం చామంతిని ఈ ఏడాది కొంతమంది రైతులు సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.

ఇక, పువ్వులు హోల్‌సెల్‌ మార్కెట్‌లో ధరలు పోల్చుకుంటే.. బహిరంగ మార్కెట్‌లో మరింత అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంది.. రైతుల నుంచి వినియోగదారునికి పువ్వులు చేరే సరికి వాటి ధరలు భారీ మార్పులు కనిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story