Low Budget New Car : తక్కువ బడ్జెట్ లో కొత్త మోడల్ లగ్జరీ కారు వచ్చేసింది

Low Budget New Car : తక్కువ బడ్జెట్ లో కొత్త మోడల్ లగ్జరీ కారు వచ్చేసింది

మిడిల్ క్లాస్ కల ఓ కారు. తక్కువ బడ్జెట్ లో కొత్త కారు కోసం కొనుక్కోవాలని ఎంతోమంది ఆశిస్తుంటారు. పాత కార్లు నడిపినా కొత్త కారు ఉంటే ఆ ఫీలింగే వేరు. ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ లేటేస్ట్ ఫీచర్స్ ను జోడించి, తక్కువ ధరకు కారును మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే గ్రాండ్ ఐ 10. ఈ మోడల్ ఇదివరకే పరిచయం అయినప్పటికీ గ్రాండ్ ఐ 10 నియోస్ కొత్త వేరియంట్. గ్రాండ్ ఐ 10 పాత మోడల్ ను పోలినప్పటికీ కొన్ని స్పెషిఫికేషన్స్ మార్చారు.

కొత్త మోడల్ లో మ్యూజిక్ కోసం బ్లూటూత్ కంట్రోల్స్ 4 స్పీకర్ సిస్టమ్ ఉన్నాయి. హ్యాచ్ బ్యాక్ లో డ్రైవర్ సీటులో మార్పులు చేశారు. కార్పొరేట్ ఎడిషన్ గ్రే డ్యూయెల్ టోన్ ట్రీట్ మెంట్ తో మార్కెట్లోకి వచ్చింది. ఫ్రంట్ రూమ్ ల్యాంప్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బ్యాక్ ప్యాకెట్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లేతో కూడిన 8.89 సెంటిమీటర్ల స్పీడో మీటర్ 17.14 సెంటి మీటర్ల టచ్ స్క్రీన్ డిస్ ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ వంటివి ఉన్నాయి. 1.2 లీటర్ నేచురల్ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. 82 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తూ 114 ఎన్ ఎం గరిష్ట టార్క్ ను రిలీజ్ చేయనుంది.

5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి గ్రాండ్ ఐ 10 నియోస్ సీఎన్ జీ వేరియంట్ లో కూడా లభ్యమవుతోంది. సేప్టీ కోసం ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ 3 పాయింట్ సీట్ బెల్ట్ లు ఉన్నాయి. ధర అటుఇటుగా రూ.6.93 లక్షలు ఉండనుంది.

Tags

Read MoreRead Less
Next Story