Paytm : మా సేవలు యథాతథం.. పేటీఎం కీలక ప్రకటన

Paytm : మా సేవలు యథాతథం.. పేటీఎం కీలక ప్రకటన

ప్రముఖ ఫినాన్షియల్ టెక్ సంస్థ పేటీఎం కస్టమర్ సర్వీస్, ఆర్బీఐ ఆదేశాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. పేటీఎం (PAYTM) పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఫిబ్రవరి 29న విధించిన ఆంక్షల్ని మార్చి 15 వరకు పొడిగిస్తూ ఆర్‌బీఐ ఓ కీలక ప్రకటన చేసింది. దీనిపై పేటీఎం ఫౌండర్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ స్పందించారు. మార్చి15 తర్వాత పేటీఎం, సౌండ్‌బాక్స్‌, కార్డ్‌ మెషిన్‌ సేవల్లో ఎలాంటి మార్పులు ఉండవని, కార్యకలాపాలు కొనసాగుతాయని పేటీఎం ఫౌండర్‌ తెలిపారు. ఆర్‌బీఐ ఆంక్షలు ప్రభావితం చూపవని అని అన్నారు.

సోషల్ మీడియా ఎక్స్ లో విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. పేటీఎం క్యూఆర్‌ కోడ్‌, సౌండ్‌బాక్స్, ఈడీసీ(కార్డ్ మెషీన్) మార్చి 15 తర్వాత ఎప్పటిలాగే పని చేస్తాయనీ. ఆర్బీఐ FAQలోనూ ఇదే అంశం ఉందని తెలిపారు. ఎటువంటి పుకార్లకు లొంగవద్దని.. వినియోగదారులను డిజిటల్‌ ఇండియా ఛాంపియన్‌గా నిలబెట్టేందుకు చేసే ప్రయత్నాలకు సహకరిచాలని కోరారు.

మార్చి 15 వరకు కూడా వాలెట్‌లు, ప్రిపెయిడ్ మెషినరీ, కస్టమర్ ఖాతాలు, ఫాస్టాగ్‌లు, కామన్ మొబిలిటీ కార్డ్‌ల్లో డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, టాప్ అప్‌లు యథాప్రకారం అనుమతించబడతాయని పేటీఎ ఫౌండర్ క్లారిటీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story