Biryani Orders : రంజాన్ ఎఫెక్ట్.. 60 లక్షల బిర్యానీ ఆర్డర్స్

Biryani Orders : రంజాన్ ఎఫెక్ట్.. 60 లక్షల బిర్యానీ ఆర్డర్స్

రంజాన్ మాసంలో దేశవ్యాప్తంగా 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ వెల్లడించింది. సాధారణ నెలలతో పోల్చితే బిర్యానీ ఆర్డర్లు 15 శాతం ఆర్డర్లు పెరిగాయని తెలిపింది. 10 లక్షల బిర్యానీ, 5.3 లక్షల హలీమ్లను ఆర్డర్ చేయడంలో హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలిచిందని వెల్లడించింది. రంజాన్ సందర్భంగా సాధారణ రోజులతో పోలిస్తే దేశవ్యాప్తంగా ప్రసిద్ధ వంటకా లకు ఆర్డర్లు గణనీయంగా పెరిగాయి.

బిర్యానీ, హలీంలతో పాటు సమోసాలు, భాజియా, మల్పువా, ఫిర్ని, రబీ లాంటి ఫుడ్ ఐటెమ్స్ కూడా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. డ్రైఫ్రూట్స్, ఫ్రూట్ సలాడ్స్ సైతం భారీగా ఆర్డర్స్ వచ్చాయి. హలీమ్ 1454.88 శాతం భారీ పెరుగుదలను నమోదు చేయగా, ఫిర్ని 80.97 శాతం వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది.

మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం పెరిగాయి. ఫాలుదా 57,93%, డేట్స్ 48.40% పెరిగాయని స్విగ్గీ వెల్ల డించింది. రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఉపవాసాలు చేస్తున్న ముస్లింలు తమ దీక్ష విరమించేందుకు స్విగ్గీ లాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీలకే ఎక్కవ మొగ్గు చూపారు.

Tags

Read MoreRead Less
Next Story