Swiggy : రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్

Swiggy : రైలు ప్రయాణికులకు స్విగ్గీ ఫుడ్

రైల్వే ప్రయాణికులు తమ ప్రయాణంలో నచ్చిన ఫుడ్ ను నచ్చిన రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. మీరు ఈ ఫుడు స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసుకోవ చ్చు. ఈ మేరకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (ఐఆర్సీ టీసీ)తో స్విగ్గీ ఒప్పందం చేసుకుంది. మార్చి 12 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

తొలుత విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూర్ స్టేషన్ల లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. తరువాత కాలంలో 59 స్టేషన్లకు ఈ సేవల ను విస్తరించనున్నారు. మంగళవారం నాడు జరిగిన ఒప్పందంపై ఐఆర్ సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్, స్విగ్గీ ఫుడ్ సీఈఓ రోహిత్ కపూర్ సంతకాలు చేశారు. స్విగ్గీలో ఫుడు ఆర్డర్ చేసేందుకు ఐఆర్ సీటీసీ యాప్ను ఉప యోగించాల్సి ఉంటుంది.

అందులో పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి కావాల్సిన ఆహారాన్ని కావాల్సిన స్టేషన్లో డెలివరీ తీసుకోవచ్చు. ఈ భాగస్వామ్యం వల్ల ప్ర యాణికులు తమకు ఇష్టమైన ఆహారాన్ని పొందుతారని సంజయ్ కుమార్ జైన్ తెలి పారు. రైల్వే ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు స్విగ్గీ సీఈఓ రోహిత్ కపూర్ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story