Techno Spark 20C : టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ లోనే అదిరిపోయే ఫీచర్స్

Techno Spark 20C : టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ లోనే అదిరిపోయే ఫీచర్స్

తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో (Techno). ఎప్పటికప్పుడు వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేసిన ఫోన్ లతో పాటు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది.

లేటెస్ట్ గా టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టెక్నో స్పార్క్‌ 20సీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో స్పార్క్‌ 20సీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ మార్చి 5వ తేదీన సేల్‌ ప్రారంభం కానుంది. టెక్నో స్పార్క్‌ 20సీ ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8,999కాగా లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 1000 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 7,999కే సొంతం చేసుకోవచ్చు.

ప్రముఖ ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో గేమింగ్ కోసం ప్రత్యేక టెక్నాలజీని అందించారు. ఈ ఫోన్‌ను కేవలం 50 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో జీ36ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 720 x 1,612 పిక్సెల్‌ రిజల్యూషన్‌, 90Hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. MediaTek Helio G36 SoC ప్రాసెసర్‌ ఉంది. 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రేర్ కెమెరాతో మంచి క్వాలిటీ ఫొటోలు తీయొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story