IRCTC : టికెట్ కన్ఫామ్ అయితేనే డబ్బులు కట్

IRCTC : టికెట్ కన్ఫామ్ అయితేనే డబ్బులు కట్

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పో రేషన్ లిమిటెడ్ (ఐఆర్ సీ టీసీ) (IRCTC) వెబ్ సైట్ నుంచి రైల్వే టికెట్లు బుక్ చేసు కునేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. ఇ-టికెట్ బుక్ చేసుకున్న తరువాత కన్ఫామ్ అయిన తరువాతే డబ్బులు చెల్లించే విధంగా మార్పులు చేశారు. ఈ విధానాన్ని ఐ-పేమెంట్ గేట్వే విధానంలో మాత్రమే ఉపయోగించుకోవవచ్చు. ఐ-పే మెంట్ గేట్వే విధానంలో ఆటో పే ఫీచర్ యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల చెల్లింపులు చేయవచ్చు. ప్రయా ణికులు రైల్వే టికెట్ బుక్ చేసుకున్న తరువాత పీఎన్ఆర్ నెంబర్ వచ్చిన తరువాతే ఒక నుంచి టికెట్ డబ్బులు చెల్లించవచ్చు.

ఐఆర్డీసీ వెబ్ సైట్లో ఇ-టికెట్ బుక్ (E-Ticket) చేసుకున్న వారు మాత్రమే ఈ విధానాన్ని ఉపయోగించుకునే వెసులు బాటు ఉంటుంది. సాధారణ టికెట్లకు, తత్కాల్ టికెట్లకు (Tatkal tickets) కూడా ఇది వర్తిస్తుంది. సాధారణంగా రైల్వే టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ కన్ఫామ్ కావు. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారికి చివరి వరకు టికెట్ కన్ఫామ్ కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది. టికెట్ కన్ఫామ్ కాకుంటే చెల్లిం చాల్సిన అవసరంలేదు. అదే సాధారణంగా బుక్ చేసుకుంటే టికెట్ కన్ఫామ్ కాకుంటే మళ్లీ రిఫండ్ కోసం దరఖాస్తు చేసు కోవాల్సి ఉంటుంది.

తాత్కాల్ వెయిటింగ్ జాబితా విషయంలోనూ ఇది వర్తిస్తుంది. చాట్ ప్రిపేర్ చేసిన తరువాత కూడా మీకు టికెట్ కన్ఫామ్ కాకుంటే కాన్సిలేషన్ ఛార్జీలు, కన్వెనెన్స్ ఫీ వంటివి మాత్రమే మినహాయంచుకుని మిగిలిన వాటిని ఆటోమెటిక్ గా యూజర్ అకౌంట్ కు రిఫండ్ చేస్తారు. వెయిటింగ్ లిస్టఉన్నప్పటికీ ఐఆర్టీసీ ఐపే విధానంలో టికెట్ బుక్ చేసుకున్న వారికి కన్ఫామ్ కాకుంటే ఇన్సెంట్ రిఫండ్ వస్తుంది.

సాధారణంగా ఇలాంటి టికెట్లకు మూడు నాలుగు పనిదినాల్లో డబ్బులు రిఫండ్ అవుతాయి. ఐఆర్టీసీ కొత్తగా తీసుకు వచ్చిన ఆటో పేని ఉపయో గించుకుని ఇ-టికెట్ బుక్ చేసుకునే వారికి కొత్త విధానం ఎంతో ఉపయోపడుతుంది. వెయిటింగ్ లిస్టు ఉన్నప్పటికీ తాత్కల్ టికెట్లు బుక్ చేసుకున్న సమయంలోనూ కన్ఫమ్ అయిన తరువాతే యూజర్ అకౌంట్ నుంచి డబ్బులు ఆటో డెబిట్ అవుతాయి.

Tags

Read MoreRead Less
Next Story