Cars : బాగా సేలవుతున్న కార్లు ఇవే..!

Cars : బాగా సేలవుతున్న కార్లు ఇవే..!

కారు కొనాలనేది ప్రతి ఒక్కరి ఆశ. ఇది సాధారణమే. ఐతే... అందుబాటులో ఉన్న మోడల్స్ లో ఏది మంచిది తెలుసుకోవడం చాలామందికి ఓ సమస్య. దీనికోసం సర్వేలపై ఆధారపడుతుంటారు. అలాంటి సర్వే ఒకటి రిలీజైంది. టాప్ 3 మోడల్స్ గురించి వివరాలు బయటకొచ్చాయి.ప్రత్యేకంగా కాంపాక్ట్ ఎస్ యూవీలను ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురావడంలో కొన్ని కంపెనీలు దృష్టి సారించాయి. ఈ జాబితాలో హ్యుందాయ్, మారుతి, కియా కంపెలు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా, మారుతి నుంచి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ కార్లు బెస్ట్ కాంపాక్ట్ ఎస్ యూవీలుగా నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలనకు చెందిన కొన్ని మోడళ్లు అమ్మకాల్లో ఒకదాని తరువాత మరొకటి వరుసగా నిలిచాయి. 2023-24లో హ్యుందాయ్ క్రెటా 1,62,773 యూనిట్లు సేల్ అయ్యాయి. క్రెటాకు మారుతికి చెందిన గ్రాండ్ విటారా గట్టి పోటీ ఇచ్చింది.

మారుతి గ్రాండ్ విటారా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 1,21,169 యూనిట్లు విక్రయించింది. డిసెంబర్ లో క్రెటా అమ్మకాలు తగ్గినా.. దాని కంటే గ్రాండ్ విటారా పై చేయి సాధించింది. కియా సెల్టోస్.. థర్డ్ ప్లేస్ లో నిలిచింది. కాంపాక్ట్ ఎస్ యూవీలో బెస్ట్ కారుగా నిలిచిన దీని అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 1,00,423 యూనిట్లు ఉన్నాయి. ఇప్పుడు టాప్ 3 ట్రెండింగ్ లో ఉన్న కార్లు ఇవే.

Tags

Read MoreRead Less
Next Story