Alia Bhatt : ఆలియా భట్ కి అరుదైన గౌరవం

Alia Bhatt : ఆలియా భట్ కి అరుదైన గౌరవం

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కి ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లలో ఆలియా భట్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా లో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

అయితే కేవలం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ఆలియా భట్ కు క్రేజ్ ఉందనే విషయం తాజాగా వెల్లడైంది. వరల్డ్ వైడ్ ప్రముఖల జాబితాను ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ వెల్లడించింది. ఆలియా భట్ ఈ టైమ్స్ 100 జాబితాలో నిలిచింది. భారత్ కు చెందిన మరికొందరు కూడా ఈ జాబితాలో చోటు సంపాందించారు.

కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఆలియా ఒక్కరు మాత్రం ఉండటం గమనార్హం. బాలీవుడ్ నటికి ఇంతటి గౌరవం దక్కడం చాలా అరుదని విశ్లేషకులు అంటున్నారు. హాలీవుడ్ లో గత ఏడాది హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమాలో అలియా భట్ ఆకట్టుకుంది. అక్కడ ప్రేక్షకులను మెప్పించడంతోనే ఇప్పుడు టైమ్స్ 100 జాబితాలో ఆలియా చోటు దక్కించుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story