ప్రతి సినిమాలో నన్ను చంపేస్తున్నారు.. హీరోయిన్ హాట్ కామెంట్స్

ప్రతి సినిమాలో నన్ను చంపేస్తున్నారు.. హీరోయిన్ హాట్ కామెంట్స్

ఓ హీరోయిన్ కి వరుసగా సినిమాల్లో చనిపోయే క్యారెక్టర్లన్ని ఇస్తున్నారని.. అదే కారణంతోనే తాను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయిందంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. ఆమె ఎవరో కాదండి మన్మథుడులో నాగార్జున ప్రేయసి.. ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాలో నటించిన అన్షు.

హీరోయిన్ అన్షు ఈ రెండు సినిమాల తర్వాత కనుమరుగైంది. ఈ రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. రెండు సినిమాల్లోనూ ఆమె క్యారెక్టర్ చనిపోతుంది. ఇక రెండు సినిమాల్లో ఆమె క్యారెక్టర్ బాగా హైలైట్ అవ్వడంతో తనకు మరో రెండు సినిమాల్లో కూడా అలాంటి క్యారెక్టర్లే వచ్చాయట. ఇక పదేపదే చనిపోయే క్యారెక్టర్లలోనే నటించాలంటే విసుగువచ్చిన ఆమె ఇంతకంటే ఖాళీగా ఇంట్లో ఉండడం బెటర్ అని తెలుగు ఇండస్ట్రీని వదిలేసినట్లు తెలుస్తుంది.

ఇండస్ట్రీకి దూరమైన తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైంది ఈ ఇన్నోసెంట్ బ్యూటీ. ఇప్పటికైనా మేకర్స్ ఇండస్ట్రీలో నటీనటుల టాలెంట్‌ను బట్టి క్యారెక్టర్లు ఇస్తే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story