Alia Bhatt : రాజమౌళి సలహాలు పాటిస్తున్నా.. ఆలియా భట్ కామెంట్స్

Alia Bhatt : రాజమౌళి సలహాలు పాటిస్తున్నా.. ఆలియా భట్ కామెంట్స్

రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది ఆలియా భట్. తెలుగు ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీ షూటింగ్ టైంలో ఆలియా భట్ రాజమౌళి మధ్యన ఏదో గొడవ జరిగిందంటూ వార్తలు గతంలో వైరల్ అయింది. వాటిలో నిజమెంతుందో తెలియదు గానీ.. తాజాగా అలియా భట్ రాజమౌళి పై చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.

అలియా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు రాజమౌళి ఇచ్చిన సజెషన్ ఇప్పటికీ ఫాలో అవుతున్నానని చెప్పుకొచ్చింది. అలా నేను పూర్తిగా నా పద్ధతిని మార్చుకున్నాను అంటూ వివరించింది.

సినిమాలను ఎంచుకునే టైంలో మొదటి నుంచి నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండేదాన్ని.. ఇదే విషయాన్ని ఓ టైంలో రాజమౌళికి చెప్పానని వివరించింది. ఏది చేసినా ప్రేమతో చేయండి.. అప్పుడు అది ఎంత కష్టమైనా పాత్ర అయినా మీకు సులువుగా అనిపిస్తుంది. ఎలాంటి ఫలితం వచ్చినా సరే ప్రేక్షకులు మీ నటనను మెచ్చుకుంటారు. మీకు కనెక్ట్ అవుతారని చెప్పారని.. ఈ ప్రపంచంలోనే ప్రేమతో చేసే పనికి మించిన గొప్పది ఏది ఉండదు అంటూ వివరించారని.. ఆయన చెప్పిన ఈ మాటలను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటా.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను అంటూ వివరించింది.

ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ఎంత కష్టమైనా పాత్రనైనా నటించడానికి ఫిక్స్ అయిపోయా అంటూ అలియాభట్ వెల్లడించింది. ఆలియా ప్రస్తుతం జిగ్ర అనే బాలీవుడ్ మూవీలో నటిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story