Allu Arjun Wife : అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కొత్త లుక్ వైరల్

Allu Arjun Wife : అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి కొత్త లుక్ వైరల్

స్టార్ హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డిది ఒక టాప్ మోడల్ కి, అందమైన కథానాయికకు ఎంతమాత్రం తీసిపోని రూపం. ఇలా డిజైనర్ లుక్ లో కనిపిం చడం స్నేహారెడ్డికి కొత్తేమీ కాదు. సెలబ్రి టీ వైవ్స్ లో మోడలింగ్ లో సత్తా చాటే ట్యాలెంట్ తనకు ఉందని మరోసారి నిరూ పిస్తూ ఈ కొత్త లుక్ లో కనిపించారు. గరి మగార్గ్ ఈ లుక్ కి స్టైలింగ్ చేశారు. రిమ్ జిమ్ డాడు ఔట్ ఫిట్కి రూపకర్త... అని స్నేహారెడ్డి సోషల్ మీడియాల్లో వెల్లడించారు. ప్రస్తుతం ఈ కొత్త లుక్ ఇన్ స్టాలో వైరల్ గా మారింది. స్నేహా ఈ డిజైనర్ లుక్ లో చాలా అందంగా ఉన్నారంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. లెదర్ తో డిజైన్ చేసిన బాటమ్.. డిజైనర్ టాప్ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయంటూ ప్రశంసిస్తున్నారు. బన్నీ సరసన కథానాయి కగా నటించేస్తుందేమో! అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియాలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. పుష్ప ఘనవిజ యం సాధించాక పుష్ప 2తో సంచలనాలకు తెరతీయబోతున్నాడు. ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదల చేయగా వైరల్ గా దూసుకెళ్లింది.

Tags

Read MoreRead Less
Next Story