Ananya Nagalla : బోల్డ్ సీన్స్ చేయాలని లేట్‌గా తెలుసుకున్నా.. అనన్య నాగళ్ల హాట్ కామెంట్స్

Ananya Nagalla : బోల్డ్ సీన్స్ చేయాలని లేట్‌గా తెలుసుకున్నా.. అనన్య నాగళ్ల హాట్ కామెంట్స్

వకీల్ సాబ్ బ్యూటీ, సన్న నడుం అనన్య నాగళ్ల (Ananya Nagalla) మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆమె నటించిన తంత్ర, పొట్టేలు మూవీ ట్రైలర్స్ ఇండస్ట్రీలో బజ్ క్రియేట్ చేశాయి. భయంగొలిపే సీన్స్ తోపాటు.. రొమాంటింగ్ సీన్స్ లోనూ అనన్య నాగళ్ల రెచ్చిపోయి నటించింది.

టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో మల్లేశం మూవీ తో ఎంట్రీ ఇచ్చింది అనన్య నాగళ్ల. ప్లే బ్యాక్, వకీల్ సాబ్, మాస్ట్రో, మళ్లీ పెళ్లి లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. అనన్య ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది. తంత్ర అనే హారర్ మూవీ తో పాటు పొట్టేలు అనే మరోమూవీలో కూడా అనన్య నటిస్తోంది. ఇప్పటికే అనన్య పాండే నటించిన ఈ పొట్టేలు సినిమా నుంచి లిప్ కిస్ సన్నివేశాలు రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో తంత్ర ట్రైలర్ లాంచ్‌లో పొట్టేల్‌ మూవీ ముద్దు సీన్స్ గురించి ఆసక్తికరమైన క్వశ్చన్ ఎదురైంది.

తంత్ర ( Tantra ) సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలు ఉంటాయా అని ప్రశ్నించగా.. దానికి అనన్య స్పందిస్తూ పొట్టేలు సినిమాలో ఆ ముద్దు సన్నివేశం చాలా అవసరం అందుకే నటించాల్సి వచ్చింది. ఈ సినిమాలో గ్లామర్, రొమాన్స్, హర్రర్ అన్ని ఉంటాయంటూ వివరించింది. నటన అంటే ఇలాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న రోల్ లో కూడా నటించడమేనని అర్థం చేసుకోవడానికి కాస్త టైం పట్టింది అంటూ అసలు విషయం బయటపెట్టింది ఈ భారీ అందాల బ్యూటీ.

Tags

Read MoreRead Less
Next Story