Anasuya : రంగమ్మత్తకు బంపరాఫర్.. స్టార్ హీరోతో అనసూయ రొమాన్స్

Anasuya : రంగమ్మత్తకు బంపరాఫర్.. స్టార్ హీరోతో అనసూయ రొమాన్స్

సినిమాలు, టీవీ షోలు.. సోషల్ మీడియా.. ఎక్కడ చూసినా అనసూయే కనిపిస్తుంది. కొన్నేళ్లుగా ఆమె ట్రెండింగ్ లోనే ఉంటోంది. అనసూయ (Anasuya) చేతుల్లో ఆరుకు పైగానే ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో దూసుకుపోతుంది.

రంగస్థలంలో రంగమ్మత్త.. పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలు ఆమెకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టాయి. పుష్ప 2 సినిమాలో కూడా ఈమె పాత్ర హైలెట్ గా మారబోతుంది అంటూ తెలుస్తోంది. లేటెస్ట్ గా అనసూయ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో హీరోయిన్గా కీలక పాత్ర కోసం సెలెక్ట్ అయిందని టాక్.

ఈ ప్యాన్ ఇండియా మూవీలో అనసూయ, చిరంజీవిల మధ్య ఫన్నీ రొమాన్స్ కూడా ఉండబోతుందట. చిరంజీవి పలు సినిమాలలో అనసూయ ఇప్పటికే స్క్రీన్ షేర్ చేసుకుంది. కుర్రాళ్ళను ఆకట్టుకునేలా చిరంజీవితో అనసూయ పాత్ర డిసైడ్ చేశారట.. చూడాలి ఆ కాంబో ఎలా ఉంటుందో.

Tags

Read MoreRead Less
Next Story