Anchor Sreemukhi : హీరో చెంపపై యాంకర్ శ్రీముఖి దెబ్బ.. వీడియో వైరల్

Anchor Sreemukhi : హీరో చెంపపై యాంకర్ శ్రీముఖి దెబ్బ.. వీడియో వైరల్

తెలుగు టీవీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ శ్రీముఖి. అల్లరి రాములమ్మగా పాపులర్. బిగ్ బాస్ తర్వాత భారీ ఫాలోయింగ్ తో వరుస షోలలో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.

యాంకర్‌గా దూసుకుపోతున్న శ్రీముఖి.. తాజాగా ఓ యంగ్‌ హీరోపై ఫైర్ అయింది. స్టేజ్ పై అందరి ముందే ఆ హీరో చెంప చెల్లుమనిపించింది.

శ్రీముఖి యంగ్‌ హీరో చెంప చెల్లుమనిపించడానికి కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. కేరింత మూవీ ఫేమ్ యంగ్ హీరో పార్వతీశం.. ప్రస్తుత మార్కెట్ మహాలక్ష్మి సినిమాలో బిజీగా గడుపుతున్నాడు. విఎస్ ముఖేష్ డైరెక్షన్లో ప్రణికాన్వికా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇందులో హర్షవర్ధన్స మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మార్చి 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరు అందుకున్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా స్టార్ యాంకర్ శ్రీముఖి స్టేజిపై మాట్లాడుతుండగా.. పార్వతీశం స్టేజి పై శ్రీముఖి దగ్గరికి వెళ్లి మీరంటే నాకు చాలా ఇష్టం.. ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేయడంతో.. శ్రీముఖి ఒక్కసారిగా ఆ హీరో చెంప ఛెళ్లుమనిపిస్తుంది ఏయ్.. మార్కెట్ మహాలక్ష్మి మనతో మజాక్ లాడితే మంచిగా ఉండదు.. అంటూ డైలాగ్ వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Tags

Read MoreRead Less
Next Story