Andrea : మూడేళ్ల తర్వాత ఆండ్రియా సినిమాకు మోక్షం

Andrea :  మూడేళ్ల తర్వాత ఆండ్రియా సినిమాకు మోక్షం

కోలీవుడ్ నటి ఆండ్రియా.. సింగర్ గా తన జీవితాన్ని ప్రారభించి అనంతరం సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో హిట్ సాంగ్స్ పాడి మంచి గుర్తింపును తెచ్చుకుంది. కందా నాల్ ముదల్ సినిమాతో ప్రేక్షకులకు ఈ బ్యూటీ పరిచయమైంది. అటు నటిగానూ ఇటు సింగర్ గానూ రాణిస్తోంది. రీసెంట్ వెంకటేశ్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమాలోనూ ఈ బ్యూటీ నటించింది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

అయితే చాలా కాలంగా ఈ అమ్మడు ఎలాంటి హిట్ అందుకోలేదు. కానీ అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటుంది. టాలీవుడ్, కోలీవుడ్ నటిస్తూ.. అభిమానులను అలరిస్తోంది. అయితే మూడేళ్ల క్రితం కా అనే సినిమాలో బ్యూటీ నటించింది. అనివార్య కారణాలతో ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడా సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో ఆండ్రియా సోలో హీరోయిన్ గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ పాత్రను పోషించింది. వృత్తిలో భాగంగా అడవి జంతువులను ఫొటోలు తీసేందుకు దట్టమైన అడవిలోకి వెళ్లి చిక్కుకుంటుంది. అక్కడ ఉండే క్రూరమృగాల నుంచి ఆమె ఎలా బయటపడ్డారన్నదే ఈ చిత్రం కథ.

Tags

Read MoreRead Less
Next Story