Andrea : బస్సులో ఉన్నప్పుడు షర్ట్‌లో చెయ్యి పెట్టాడు.. ఆండ్రియా స్వాగతం

Andrea : బస్సులో ఉన్నప్పుడు షర్ట్‌లో చెయ్యి పెట్టాడు.. ఆండ్రియా స్వాగతం

ఆండ్రియా లుక్స్ కిరాక్ అని చెప్పడంలో డౌటే లేదు. రీసెంట్ గా సైంధవ్ మూవీలో దుమ్ములేపింది ఈ పిల్ల. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. 11 ఏళ్ల వయస్సులోనే తాను లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు తెలుగు మలయాళం సినిమాల్లో నటిస్తూ వస్తుంది. చెన్నై లోని అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె నుంగంబాక్కంలోని మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. చిన్నప్పటి ఉండే పాటలు పాడడం అలవాటు చేసుకున్న ఈమె..చిత్రసీమలో అడుగుపెట్టిన తర్వాత కూడా హీరోయిన్ గా చేస్తూనే తమిళంతో పాటు తెలుగులో కూడా పదుల సంఖ్యలో సూపర్ హిట్ సాంగ్స్ ను ఆలపించింది.

బొమ్మరిల్లుతో మొదలు పెట్టి.. స్టార్ హీరోల సినిమాల్లో హిట్ సాంగ్స్ ను ఆలపించింది. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను ఆమె ఏ మాత్రం దాపరికం లేకుండా బయటపెడుతూ వస్తోంది. ఇప్పటికే తన లవ్ లైఫ్ గురించి బయట పెట్టేసింది ఆండ్రియా. ఇక తన జీవితంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి కూడా ఆండ్రియా తెలిపింది. 11 సంవత్సరాల వయసులోనే తనని ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడని వివరించింది ఆండ్రియా.

బస్సులో వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి తన టీ షర్ట్ లో చేయి వేసి ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది ఆండ్రియా. "ఈ ఘటన జరిగిన వెంటనే భయపడిపోయాను. ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా భయంతో వచ్చి మా నాన్న పక్కన కూర్చున్నాను. ఈ విషయం ఎవరికీ చెప్పలేక ఏడుపు మొదలుపెట్టానని" ఆండ్రియా తెలిపింది. కామెంట్లతో తమ సానుభూతిని, మద్దతును ప్రకటిస్తున్నారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story