Ariyana : అరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం

Ariyana : అరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం

బుద్ధిగా కనిపించి బోల్డ్ ఆటిట్యూడ్ తో దూసుకొచ్చిన బ్యూటీ బిగ్ బాస్ బ్యూటీ అర్యానా గ్లోరీ (Ariyana Glory). యూట్యూబ్ యాంకర్ గా కెరీర్‌ను మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ టైంలోనే సంచలనంగా మారింది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద సెలబ్రిటీ అయిపోయింది.

అరియానా గ్లోరీ షేర్ చేసిన ఓ వీడియో అందరికి షాక్ ఈగిలేలా చేసింది. వర్మ ఇంటర్వ్యూతో అరియానా ఫేమస్సయిన సంగతి తెలిసిందే. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ బ్యూటీ.. డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా పలుమార్లు బిగ్ బాస్‌షో కి హోస్టుగా వ్యవహరించిన ఈ చిన్నది.. మంచి ఫామ్ లో దూసుకుపోయింది. సోషల్ మీడియాలో అందాలొలికే వీడియో షూట్లతో సందడి చేస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ఉంటోంది.

రీసెంట్ గా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసుకుంది. ఆమె ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లుగా ఈ వీడియోలో ఉంది. అర్యానా గ్లోరీ ఫ్యాన్ కు క్లాత్ కట్టి ఉరివేసుకుంటున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి ఆమె హ్యాండ్ బ్యాగ్ లో నుంచి నెయిల్ పాలిష్ తీసి చూపిస్తుంది. అప్పుడు అర్యానా సూసైడ్ చేసుకోవడం మానేసి.. కిందకు దిగి మరి గబగబా నెయిల్‌ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. మా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story