Balakrishna : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ!

Balakrishna : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఇస్మార్ట్ బ్యూటీ!

బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య 109 సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుంది? ఎంతటి మాస్ రోల్ లో బాలయ్య కనిపించనున్నాడు? అతడి లుక్ ఎలా ఉంటుంది? అన్న ఎగ్జిట్ మెంట్ ఆయన అభిమానుల్లో ఏర్పడుతోంది. ఈ తరుణంలోనే ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటొచ్చింది. ఇందులో అందాల తార నిధి అగర్వాల్ కూడా నటించినున్నట్లు వార్తలొస్తున్నాయి.

అయితే ఈ బ్యూటీ బాలయ్యకి జోడీగా హీరోయిన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తుందా.. ? లేదా మరేదైనా కీలక పాత్ర పోషిస్తుందా అన్న దానిపై క్లారిటీ లేదు. బాలయ్య సినిమాలో నిధి నిజంగానే నటించనున్నట్లు వస్తున్న వార్తలు నిజమైతే.. ఆమెకు కాస్త బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. చాలా రోజులుగా అవకాశాలు లేక డీలా పడ్డ ఈ బ్యూటీకి.. ఈ సినిమాతో తన టాలెంట్ ను మళ్లీ ప్రూవ్ చేసుకునే చాన్స్ దక్కుతుంది.

ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బాలయ్య.. అవి పూర్తికాగానే మళ్లీ షూట్ లోకి ఎంట్రీ ఇస్తారు. దీంతో ప్రస్తుతం బాలయ్య లేని సీన్స్ షూట్స్ చేస్తున్నట్లు సమాచారం. కాగా సినిమాలోని కొన్ని సన్నివేశాలు బాలయ్యని ఓ రేంజ్ లో హైలైట్ చేస్తాయని ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story