Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఇవేనట!

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫిట్ నెస్ సీక్రెట్స్ ఇవేనట!

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. దాని తరువాత తమిళ్ లో సైతం స్టార్ హీరో సూర్య సరసన చాన్స్ కొట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కర్ణ'లో హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

అయితే ఏ యాక్టర్ కు అయిన ఇండస్ట్రీలో రాణించాలంటే ఫిట్ నెస్ చాలా ముఖ్యం. అందుకే చాలా మంది హీరో, హీరోయిన్ లు శరీర ఆకృతికి ప్రాధాన్యత ఇస్తారు. జాన్వీ కపూర్ కూడా ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. అందుకే ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది. దీని కోసం ఆమె రోజూ ఆరోగ్యకరమైన డైట్ తీసుకుంటూ.. వర్కౌట్స్ చేస్తుందట. ఉదయం రన్నింగ్, సైక్లింగ్, డ్యాన్స్ తో 45 నిమిషాల కార్డియో సెషన్ ఉంటుందట.

అదే విధంగా స్క్వాట్స్, పుషప్స్, వెయిట్ లిఫ్టింగ్ తదితర వ్యాయామాలు చేస్తుందట. కొంత సమయం యోగాకి కేటాయిస్తుందట . డైట్ విషయానికి వస్తే.. ఉదయం లేవగానే నిమ్మరసం, తేనె కలిపిన గ్లాసెడు గోరువెచ్చటి నీరు తాగుతుందట. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, బ్రెడ్ టోస్ట్, గ్రీన్ టీ తీసుకుంటుందట. మధ్యా హ్నం లంచ్ లో గ్రిల్ డ్ చికెన్ లేదంటే వెజిటబుల్స్, బ్రౌన్ రైస్ తో ఫిష్ తింటుందట. సాయంత్రం స్నాక్స్ లో ఫ్రూట్ స్మూతీ, బాదం, పిస్తా, జీడిపప్పు తప్పనిసరిగా ఉంటాయట. ఇక డిన్నర్ లో గ్రిల్ డ్ ఫిష్ లేదంటే చికెన్ససలాడ్లాంటివి తీసుకుంటుదట.

Tags

Read MoreRead Less
Next Story