Janhvi Kapoor : టాలీవుడ్ పై కన్నేసిన శ్రీదేవి చిన్న కూతురు

Janhvi Kapoor : టాలీవుడ్ పై కన్నేసిన శ్రీదేవి చిన్న కూతురు

అలనాటి అతిలోక సుందరి శ్రీదేవి (Sri Devi).. బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ నటించి మంచి క్రేజ్ సంపాదించుకుం ది. ఇప్పుడు శ్రీదేవి బాటలోనే ఆమె కూతుళ్లు కూడా నడిచేందుకు సిద్ధ మయ్యారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ (Janhvi Kapoor) బాలీవుడ్ లోదూ సుకెళ్తునే.. లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత వరుసగా తెలుగు సినిమాల్లో నటిం చేందుకు ప్లాన్ చేస్తోంది.

అయితే రీసెంట్ గానే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్.. బాలీవుడ్ కన్నా సౌత్ సినిమాల మీదే ఎక్కువ ఆసక్తి కనబరుస్తోందట. హిందీలో ఈ మధ్యనే కెరీర్ మొదలు పెట్టిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ ఆఫర్ లు ఉంటే చూడండని చెబుతుందట. కొంతకాలంగా తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంటున్నాయి.

హీరోయిన్ పాత్రలకు కూడా ఇక్కడి సినిమాల్లో మంచి ప్రాధాన్యత లభిస్తోంది. దీంతో తెలుగు, తమిళ్ లో ఆఫర్లు వస్తే నటిం చాలనే అభిప్రాయంలో ఖుషి కపూర్ ఉందట. ఇక ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఖుషీ కపూర్.. తన ఇంట్రెస్టింగ్ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది

Tags

Read MoreRead Less
Next Story