Hanuman 2 : చిరంజీవి.. రానా.. యష్... హనుమంతుడి పాత్ర కోసం ప్రశాంత్ వర్మ కష్టాలు

Hanuman 2 : చిరంజీవి.. రానా.. యష్... హనుమంతుడి పాత్ర కోసం ప్రశాంత్ వర్మ కష్టాలు

హనుమ్యాన్ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇండియాలో ఈ ఏడాది రూ.300కోట్ల కలెక్షన్లు దాటిన తొలి సినిమాగా హనుమాన్ రికార్డ్ సృష్టించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prashant Varma) హనుమాన్ 2 కు రెడీ అవుతున్నారు.

హనుమ్యాన్ ఫస్ట్ పార్ట్ లో దేవుడిని గ్రాఫిక్స్ తో చూపించారు. ఐతే.. హనుమ్యాన్ 2 లో మొత్తం హనుమంతుడే సినిమాను లీడ్ చేస్తారు. కాబట్టి.. హనుమంతుడిని గ్రాఫిక్స్ తో చూపించడం కష్టం. ఓ హీరోను చూపెట్టడం తప్పనిసరి. భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈసీక్వెల్ లో హనుమంతుడి పాత్రలో ఒక సీనియర్ హీరో నటిస్తే బాగుంటుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆప్రయత్నాలు ముందుకు సాగడం లేదు అన్న వార్తలు వస్తున్నాయి.

మొదట్లో ఈ సీక్వెల్ లో హనుమంతుడి పాత్ర కోసం చిరంజీవిని (Chiranjeevi) అడిగినప్పటికీ సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీలోని కొందరు చెబుతున్నారు. రానాను (Rana) సంప్రదించినప్పటికీ క్లారిటీ రాలేదంటున్నారు. 'కేజీ ఎఫ్' ఫేమ్ యష్ (Yash) ని కూడా హనుమ్యాన్ పాత్రకోసం సంప్రదిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. యష్ నితీష్ తివారీ తీయబోతున్న రామాయణంలో రావణుడి పాత్ర వేస్తున్నారు. దీంతో.. డేట్స్ ఇబ్బంది వచ్చే చాన్సుంది. సో.. ప్రశాంత్ వర్మ ఎవరిదగ్గర దగ్గర తన అన్వేషణ ఆపుతారనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story