Devara : దేవర హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చేది ఇంకెప్పుడు?

Devara : దేవర హీరోయిన్ పై క్లారిటీ ఇచ్చేది ఇంకెప్పుడు?

ఎన్టీఆర్(NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేష న్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా దేవర. రాజమౌలి (Rajamouli) డైరెక్షన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ (RRR) హిట్ తరువాత తారక్ చేస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడని సమాచారం. ఈ మూవీ నుంచి ఇప్ప టికే రిలీజైన ఎన్టీఆర్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే దేవరకు ఇద్దరు హీరోయిన్లు కావాల్సి ఉండగా.. మొదటి హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. తెలుగులో ఈ బ్యూటీ చే స్తున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. ఇక రెండో హీరోయిన్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మరాఠీ బ్యూటీ శృతి ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. దీనిపై మేకర్స్ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇంతకీ ఈ సినిమాకు శృతినే ఎంచుకుంటారా లేదా మరో హీరోయిన్ ను తీసుకుంటారా అనే దానిపై స్పష్టత లేదు.

రెండు భాగాలుగా వస్తున్న దేవర సినిమా మొదటి పార్ట్ అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు. సినిమా విడుదలకు తక్కువ సమయమే ఉన్నా సెకండ్ హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయకపోవడంతో మూవీ టీంపై ఎన్టీఆర్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువ సుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌ ‘దేవర’ (Devara) నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story