Director Shankar : ఘనంగా డైరెక్టర్ శంకర్ కూతురు రెండో పెళ్లి

Director Shankar : ఘనంగా డైరెక్టర్ శంకర్ కూతురు రెండో పెళ్లి

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహం చెన్నైలో వైభవంగా జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్‌ తరుణ్ కార్తికేయన్‌ను ఆమె వివాహమాడారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా గతంలో ఐశ్వర్య శంకర్ కు రోహిత్ అనే ఓ క్రికెటర్‌తో కరోనా సమయంలో ఘనంగా వివాహం జరిగింది. అయితే రోహిత్ పై పోక్సో కేసు నమోదవ్వడం, అతను పలు వివాదాల్లో నిలవడంతో పెళ్ళైన కొన్ని నెలలకే పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఐశ్వర్యకు రెండో పెళ్లి జరిగింది. డైరెక్టర్ శంకర్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్ అనే వ్యక్తికి ఇచ్చి గ్రాండ్‌గా పెళ్లి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ శంకర్ కి ఐశ్వర్య, అదితి అని ఇద్దరూ కూతుళ్లతోపాటు ఓ కొడుకు కూడా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story