Anupama Parameswaran : లిమిటేషన్స్ పెట్టుకుంటే మంచి పాత్రలు చేయలేం : అనుపమ

Anupama Parameswaran : లిమిటేషన్స్ పెట్టుకుంటే మంచి పాత్రలు చేయలేం :  అనుపమ

టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ బ్యూటీని ఇప్పటి వరకు ఎక్కువగా డీసెంట్ పాత్రలలోనే ప్రేక్షకులు చూస్తూ వచ్చారు. మోడ్రన్ టచ్ తో గ్లామర్ రోల్స్ లో కనిపించింది చాలా తక్కువ. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి 'డీజే టిల్లు' సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్వ్కేర్ సినిమాలో నటిస్తుంది. అనుపమ పర మేశ్వరన్ సిద్ధూ సరసన క్యూట్ లిల్లీగా అందాలు ఆరబోస్తోంది. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లును, అతడి చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. 'టిల్లు స్క్వేర్' నుంచి ఇప్పటికే విడుదలైన 'టికెటే కొనకుండా', 'రాధిక' పాటలు విశేష ఆదరణ పొందాయి. యూట్యూబ్ లో లక్షలాది వ్యూస్ తో సంచలనం సృష్టించాయి. తాజాగా ఈ

చిత్రం నుంచి 'ఓ మై లిల్లీ' అనే పాట వి డుదలైంది. ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ.. రెగ్యులర్ గా గర్ల్స్ నెక్స్ట్ డోర్ తరహా పాత్రలు చేస్తూ ఉండటంతో బోర్ కొట్టేసింది. నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే ఇంకా ఏదైనా చేయాలని పించింది. లిమిటేషన్స్ అన్ని పెట్టుకుంటే మంచి పాత్రలు చేయలేం. గ్లామర్ అండ్ బోల్డ్ క్యారెక్టర్ అయిన లిల్లీ లాంటి రోల్ ని వదులుకుంటే అంతకంటే స్టుపిడిటీ ఉండదని నా ఫీలింగ్.

నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈ క్యారెక్టర్ మంచి అవకాశం, అందుకే ఒప్పుకున్నానంటూ చెప్పుకొచ్చింది. గ్లామర్ గా ఉన్నా అంటే అది గొప్ప విషయమే నంటోందీ అమ్మడు. దానికి తాను హ్యాపీగా ఫీల్ అవుతాను అం టున్నది. సిద్దుతో కలిసిన తర్వాత మీరు ఇలా మారిపోయారంట అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి అదే నిజం అయితే సిద్దుకి థాంక్స్ చెప్పాలంటోంది. అలాగే అందరి ముందే ఓపెన్ గా లిల్లీ క్యారెక్టర్ ను తానెంతో ఇష్టపడి చేశానని చెప్పేసింది.

Tags

Read MoreRead Less
Next Story