Gaami Sensation : గామి సెన్సేషన్.. రాజమౌళి స్టోరీతో బిజినెస్‌కు ఊపు

Gaami Sensation : గామి సెన్సేషన్.. రాజమౌళి స్టోరీతో బిజినెస్‌కు ఊపు

విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ గామి (Gaami). కొత్త దర్శకుడు విశ్వధర్ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ స్పెషల్ సినిమా శివరాత్రి కానుకగా మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ మ్యాటర్ ఏంటంటే.. ఈ మూవీ ట్రైలర్ దర్శక ధీరుడు రాజమౌళి మెప్పుపొందింది. సినిమాలో విశ్వక్ అఘోరాగా కనిపించడం మరో విశేషం. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన గామి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. కారణం.. ఈ సినిమా మేకింగ్. దీని వెనుక ఆరేళ్ల కృషి ఉంది. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు నాలుగు సంవత్సరాలు తీసుకున్నారంటే మాములు విషయం కాదు.

తాజాగా గామి సినిమా మేకర్స్ పై దర్శకధీరుడు రాజమౌళి ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాపై తన ఇన్స్టాలో స్టోరీ పెట్టారు. అసాధ్యమైన కలలు కనడం.. వాటిని నిజం చేయడానికి కష్టపడటం నచ్చిందన్నారు. గామి సినిమా కోసం ప్రేక్షకులను ఆకట్టుకునే విజువల్స్ సాధించడంలో నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ సూపర్ సక్సెస్ అయ్యారన్నారు. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం వారు కష్టపడ్డారని చెప్పారు రాజమౌళి.

గామి మేకర్స్ కు బెస్ట్ విషెస్ అందించారు బాహుబలి దర్శకుడు. రాజమౌళి పోస్ట్ తో గామికి మరింత ఎలివేషన్ వచ్చింది. థియేట్రికల్, ఓటీటీ సహా.. ప్యాన్ ఇండియా రిలీజ్ కు మంచి బిజినెస్ కు బాటలు పడ్డాయి. మరి మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న గామి సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో చూడాలి.






Tags

Read MoreRead Less
Next Story