సినిమా

Srikanth: హీరో శ్రీకాంత్‌కి కరోనా పాజిటివ్..

Srikanth: తనని ఈ మధ్య కాలంలో కలిసినవారందరూ పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.

Srikanth: హీరో శ్రీకాంత్‌కి కరోనా పాజిటివ్..
X

Srikanth: ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులందరూ వరుసపెట్టి కరోనా బారిన పడుతున్నారు.. హీరో మహేష్ బాబు, దర్శకుడు తరుణ్ భాస్కర్ కరోనా బారిన పడి కోలుకున్నారు.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు..

దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలు ఉంటే ఎందుకైనా మంచిదని కరోనా టెస్ట్ చేయించుకున్నారట శ్రీకాంత్.. రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దాంతో తనని ఈ మధ్య కాలంలో కలిసినవారందరూ పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.

తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. అనారోగ్య లక్షణాలు ఉంటే ఏ మాత్రం అశ్రద్ధ చేయొద్దు.. వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆయన సూచన మేరకు తగిన మందులు వాడండి అని శ్రీకాంత్ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గత వారం శ్రీకాంత్ కుటుంబంతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Next Story

RELATED STORIES