Heroines : సమాజ సేవ చేస్తున్న హీరోయిన్లు వీళ్లే

Heroines : సమాజ సేవ చేస్తున్న హీరోయిన్లు వీళ్లే

గ్లామర్ షోతో కొందరు పాపులారిటీ సాధిస్తారు. నటనతో అభిమానుల్లో గుండెల్లో గుడి కడతారు మరికొందరు. సమాజ సేవలో తరిస్తూ చిరస్థాయిలో పేరు నిలిపుకుంటుంటారు ఇంకొందరు. టాలీవుడ్ లో ఇటు సంపాదిస్తూ.. అటు సోషల్ సర్వీస్ చేస్తున్న హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.

హీరోలకు వచ్చినంత రెమ్యూనరేషన్ హీరోయిన్స్‌కి రాకపోయినా.. వచ్చినదాంట్లో సర్వీస్ చేస్తున్నారు కొందరు సెలెక్టెడ్ హీరోయిన్లు. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఈ లిస్టులో మొదటి వరుసలో ఉంటుంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది అనాధ పిల్లలకు సహాయం చేస్తోంది. శృతిహాసన్ కూడా ఈ లిస్టులో ఉంది. తన తండ్రి కమలహాసన్ స్థాపించిన ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మందికి ఆరోగ్యం, చదువు విషయంలో తోడ్పడుతుంది.

దేశముదురు హన్సిక సోషల్ సర్వీస్ కూడా చేస్తుందంటే చాలామంది తెలియదు. కానీ.. ఆ సినిమాలో యోగిని లాగే.. సర్వీస్ లో ముందు ఉంటోంది హన్సిక. పేద పిల్లలకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని గతంలోనే ప్రకటించింది. అతి చిన్న వయసు నుంచే సేవా కార్యక్రమాలు చేస్తూ 25 మంది పిల్లలను దత్తత తీసుకొని మరి చదివిస్తోంది హన్సిక. లేటెస్ట్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా అప్పుడే సోషల్ సర్వీస్ చేస్తూ శెభాష్ అనిపించుకుంటోంది. అంగవైకల్యం ఉన్న పిల్లలను దత్తత తీసుకుని వారికి చదువు చెప్పిస్తుంది. ఆమె సొంతంగా ఒక సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్నో సోషల్ సర్వీసులు చేస్తోంది. సార్ బ్యూటీ సంయుక్తమీనన్‌ శ్రీ శక్తి సేవ అనే ఒక సంస్థను ప్రారంభించి మహిళలకు, పిల్లలకు కావలసిన సాయం చేస్తోంది. నాయకీ సేవకీల్లారా సెల్యూట్.

Tags

Read MoreRead Less
Next Story