Rashi Khanna : యోధపైనే రాశి ఖన్నా ఆశలు

Rashi Khanna : యోధపైనే రాశి ఖన్నా ఆశలు

ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా (Rashi Khanna). అనంతరం పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలతో ఈ బ్యూటీ నటించి మెప్పించింది. కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రాశి ఖన్నాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది ఈ అమ్మడు. అక్కడ సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందిన యోధ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

నిన్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో యాక్ట్ చేసిన ఈ బ్యూటీకి.. హిట్ వస్తుందో రాదో చూడాలి. యోధ విజయంపై రాశి ఖన్నా బాగానే నమ్మకం పెట్టుకుంది. అయితే చాలా రోజులుగా సరైన అవకాశాలు లేక డీలా పడిన రాశి ఖన్నా కెరీర్.. ఈ సినిమా విజయంపైనే ఆధారపడి ఉంది. కాగా బాలీవుడ్ లో ఇప్పటికే ఒకటి రెండు సినిమాలకు రాశి ఖన్నా కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story