Ileana : డి గ్లామర్ రోల్ లో ఇలియానా

Ileana : డి గ్లామర్ రోల్ లో ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా (Ileyana) టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. హీరోయిన్ గా ఈ మధ్య కాలంలో మునుపటి జోష్ ను కొనసాగించడంలో విఫలం అవుతున్న ఇలియానా పెళ్లి తర్వాత మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. పెళ్లి తర్వాత కూడా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది. త్వరలో తేరా క్యా హోగా లవ్లీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రణదీప్ కీలక పాత్రలో నటిస్తున్న తేరా క్యా హోగా సినిమాను మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇలియానా ను డీ గ్లామర్ రోల్ లో చూడబోతున్నట్లుగా ట్రైలర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. కలర్ తక్కువ ఉన్న ఒక డీ గ్లామర్ అమ్మాయి పెళ్లి కోసం తాపత్రయ పడే పాత్ర లో ఇలియానా కనిపించబో తుంది. వరకట్నం, స్కిన్ కలర్ విషయమై ఈ సినిమాలో దర్శకుడు చర్చించబోతున్నాడు. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అవ్వడంతో ఇలియానా కుమ్మేసి ఉంటుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన తేరా క్యా హోగా లవ్లీ మూవీ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరణ్ కుంద్రా, పవన్ మల్హోత్రా, గీతికా విద్య ఓహ్లియన్, రాజేంద్ర గుప్తా, అనిల్ రోధన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

Tags

Read MoreRead Less
Next Story