Indian 2 : భారతీయుడు ఒక్కపాటకు రూ.30కోట్లంట బాబోయ్

Indian 2 : భారతీయుడు ఒక్కపాటకు రూ.30కోట్లంట బాబోయ్

భారతీయుడు.. 27 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా.. ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ భారతీయుడు-2 విలక్షణ నటుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోందీ మూవీ. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

2024 ఏప్రిల్ లో ఇండియన్ 2, 2024 దీపావళిలో ఇండియన్ 3ని విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా.. అటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో పాటు భారతీయుడు-2 సినిమాకి శంకర్ ఒకేసారి పని చేయాల్సి వస్తోంది. దీంతో రెండు సినిమాల షూటింగులకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఈ సినిమాలో ఓ పాట కోసం ఏకంగా 30 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. 30 కోట్ల బడ్జెట్ తో వేసిన సెట్స్ పై కమల్ పాటను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నామని యూనిట్ తెలిపింది. ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్‌,మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, సముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు

Tags

Read MoreRead Less
Next Story