Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్..? నెట్టింట వైరల్

Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్..? నెట్టింట వైరల్

టాలీవుడ్ హీరోయిన్, మెగా ఇంటి కోడలు లావణ్య త్రిపాఠి పెట్టిన లేటెస్ట్ పోస్ట్ వైరల్ అవుతోంది. నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత ఓటీటీలకే పరిమితమైపోయింది. మిస్ పర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌ త్వరలో రానుంది.

వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంట చూడముచ్చటగా ఉంటుంది. రెండు సినిమాల్లోనూ ఈ జంట కనువిందు చేసింది. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. అప్పుడు పుట్టిన ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. ఇప్పుడు ఈ జంట మరో స్టెప్ ఎక్కినట్టు తెలుస్తోంది.

లావణ్య తన పర్సనల్ లైఫ్ సంగతులు చెబుతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తుంటుంది. లావణ్య లేటెస్ట్ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. లేత గులాబీ రంగు చీర కట్టుకున్న ఫొటోలను లావణ్య షేర్ చేసింది. అమ్మ పింక్ రూబీ చెవి దుద్దులు పెట్టుకున్నాను. చిన్ననాటి జ్ఞాపకాలకు ఇవి ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. తానెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది.. అంటూ లావణ్య పోస్ట్ చేసింది. దీంతో... తమకు తోచినట్గు ఆభిమానులు లావణ్యను విష్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story