Jabardasth : గర్భం దాల్చిన జబర్దస్త్ లేడీ కమెడియన్.. సీమంతం వేడుక ట్రెండింగ్‌

Jabardasth : గర్భం దాల్చిన జబర్దస్త్ లేడీ కమెడియన్.. సీమంతం వేడుక ట్రెండింగ్‌

జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎందరికో సక్సెస్ బ్రేక్ ఇచ్చింది. ఆ ప్రోగ్రామ్ లో పాల్గొని పాపులారిటీ పెంచుకున్నవాళ్లెందరో ఉన్నారు. ప్రోగ్రామ్ తో మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఓ లేడీ కమెడియన్ గర్భం దాల్చడం, సీమంతం జరుపుకోవడం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

న్యూస్ ఛానల్ లో తెలంగాణ వార్తలతో జోర్దార్ సుజాతగా పాపులర్ అయ్యింది సుజాత. 2020లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో ఆమె పాల్గొని మొట్టమొదటిసారి పాపులారిటీ పెంచుకున్నారు. హోస్ట్ నాగార్జునను ఈమె బిట్టూ అని పిలిచేది. ఆ సీజన్ విన్నర్ గా అభిజీత్ టైటిల్ అందుకున్నాడు. అనంతరం సుజాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాకింగ్ రాకేష్ టీమ్ లో సుజాత స్కిట్స్ చేస్తోంది. ఈ క్రమంలో రాకింగ్ రాకేష్ ప్రేమలో పడింది. వీరిద్దరూ తమ ప్రేమను జబర్దస్త్ వేదికగా ప్రకటించారు. అనంతరం పెళ్లి చేసుకున్నారు.

రాకేష్ వివాహం చేసుకోకూడదు అనుకున్నాడట. రాకేష్ తమ్ముడికి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారట. రాకేష్ మాత్రం పెళ్లి చేసుకోకపోవంతో తల్లి చాలా ఆవేదన చెందేవారట. అలాంటి రాకేష్ ని పెళ్ళికి ఒప్పించిన సుజాతకు అతని తల్లి అభినందించింది. వీరిద్దరూ అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. సుజాత సీమంతం ఫొటోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. సేవ్ ది టైగర్స్ తో వెబ్ సిరీస్ మార్కెట్ క్రియేట్ చేసుకుంది సుజాత. సో.. ఈ జంట ఇప్పుడు సక్సెస్ బాటలో పయనించడం అభిమానులను ఆనంద పరుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story